ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. రాజకీయ హత్యలకు పాల్పడుతుందని సీపీఐ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ చేపడుతున్న సీబీఐ అధికారుల పైనే వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని అన్నారు. ఇప్పటికే వైఎస్ వివేకాను ఎవరు..? ఎందుకు..? హత్య చేశారని రాష్ట్ర ప్రజలకు తెలిసి పోయిందని అన్నారు. ఈ హత్యకు వైఎస్ జగన్ కుటుంబం బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోల్డ్ బ్లడ్ మర్డర్లు జరుగుతున్నాయని ఆరోపించారు.
భవష్యత్తులో కూడా రాజకీయ హత్యలు పెరుగుతాయని అన్నారు. ఇదీల ఉండగా.. సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైకరి బాగాలేదని అన్నారు. ప్రభుత్వ ఏకపక్ష దోరణి వల్లే యువత తిరగబడుతుందని అన్నారు. తాను కూడా భీమ్లా నాయక్ సినిమా చూశానని అన్నారు. ఈ సినిమా సమాజానికి సందేశం ఇవ్వకపోయినా.. వినోదాన్ని పంచుతుందని అన్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వంలో సినిమాలు కూడా భయంతో చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.