మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం..నాగబాబు సంచలన ట్వీట్

-

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో ట్విట్టర్ లో మళ్లీ ఆక్టీవ్ అయ్యారు.ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, తాజా పరిణామాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు.జగన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు.ఇటీవల కరెంటు కోతలపైనా మండిపడ్డారు.2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు.ఎన్నికల్లో నర్సాపురం నుంచి ఎంపీగాపోటీ చేసి ఓడిపోయారు.ఆ తర్వాత కొద్ది రోజులు యాక్టివ్ గాఉన్నా..తర్వాత సైలెంట్ అయ్యారు.పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు..జనసేన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.ఆయన రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

అయితే నాగబాబు తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడిస్తారు అనే విషయం తెలిసిందే.సోషల్ మీడియా ద్వారా ఆయన ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు.తాజాగా ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.”మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే”..మీరు మూర్ఖుల పాలన లో జీవించడం ఖాయం…అని ట్వీట్ చేశారు.అయితే ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు అనే విషయంలో క్లారిటీ లేదు.వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news