వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తే గానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి బాధ్యతలు గుర్తు రావని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్ట పోయారని అన్నారు. రైతు బంధు అమలు చేస్తున్నట్టు పంట బీమా ను ఎందుకు వర్తింప చేస్తాలేరని ప్రశ్నించారు.
అలాగే ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంట నష్ట పోయిన రైతులు అందరికీ నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పోయిన రైతులకు సాయం చేయాలన్న సోయి సీఎం కేసీఆర్ కు లేదని విమర్శించారు. మళ్లీ కోర్టులు కలగజేసుకుని మొట్టి కాయలు వేస్తేనే సోయి వస్తుందంటూ విమర్శించారు. కాగ రైతు బంధు వారోత్సవాలు చేయడమే కానీ రైతులను ఆదుకోవడం సీఎం కేసీఆర్ విస్మరించారని మండి పడ్డారు.