ప్రజాక్షేమానికి దొర చెప్పిన సంక్షేమానికి పొంతనే లేదు : షర్మిల

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెలరేగిపోతున్నారు. కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ను ఆయన సర్కార్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల, తాజాగా మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ”4 కోట్ల నా తెలంగాణ ప్రజలకు ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి, అధికారమిస్తే.. నట్టేట ముంచడంలో బహుశా ప్రపంచంలోనే కేసీఆర్ నెంబర్.1. ప్రజాక్షేమానికి, దొర చెప్పిన సంక్షేమానికి పొంతనే లేదు. జనాలను గొర్రెలను చేసి, స్కీంల పేరిట బురిడీ కొట్టించి, ఓట్లు దండుకున్నాక అన్ని పథకాలకు పిండం పెట్టిండు. ‘అర చేతిలో వైకుంఠం, ఓట్లు పడ్డాక ఫామ్ హౌజ్ లో ఉంటం’. ఇదే పదేళ్లుగా దొర చేస్తున్న మాయాజాలం. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. 10ఏళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు అమలు చేయని కేసీఆర్ దేశానికి అసలైన దార్శనికుడట.

Sharmila will soon join Congress, says Ramachandra Rao

10 ఏళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు అమలు చేయని కేసీఆర్.. దేశానికి అసలైన దార్శనికుడని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. సున్నా వడ్డీ పేరు చెప్పి 60లక్షల మంది మహిళలను మోసం చేశాడని… లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. కేజీ టు పీజీ అని చెప్పి 2 వేల సర్కారీ బడులనే బంద్ పెట్టాడని విమర్శించారు. పిల్లలకు సన్న బువ్వ అని చెప్పి 22 లక్షల మంది పిల్లలకు ఉన్న బువ్వ లేకుండా చేశారని మండిపడ్డారు. 3 వేల నిరుద్యోగ భృతి పేరు చెప్పి 50 లక్షల మంది నిరుద్యోగులకు పంగనామాలు పెట్టారని ఫైర్ చురకలంటించారు. 5 వేల రైతు బంధు చూపించి.. 35వేల సబ్సిడీ పథకాలను ఆపారని..3ఎకరాల భూ పంపిణీ పథకం 30మందికైనా దక్కకుండా 18 లక్షల మంది దళితులను మోసం చేశారని దుయ్యబట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news