మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దరిద్రపు పాలన నడుస్తోందని, ఎనిమిదేండ్లుగా బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన మోసగాడు సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన ఆమె సాయంత్రం కొల్లాపూర్ పట్టణానికి చేరుకుని.. అక్కడ సభలో మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య బూటకమేనని, రాష్ట్రంలో సర్కార్ బడుల కంటే బెల్టు షాపులే ఎక్కువగా ఉన్నాయని మండిపడ్డారు వైఎస్ షర్మిల . మద్యం అమ్మకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని, ఇదే కేసీఆర్ మార్క్ సంక్షేమమని ఆమె ఎద్దేవా చేశారు. సీఎం ప్రకటించిన పథకాలు, ఇచ్చిన హామీలు అన్నీ మోసమేనని వైఎస్ షర్మిల అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు వైఎస్ షర్మిల.
సింగోటం–- గోపాల దిన్నె లింక్ కెనాల్ పనులు ఎందుకు ప్రారంభించలేదని షర్మిల నిలదీశారు. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మోసం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌ది అయితే, దానిని మేయింటేన్ చేసే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. వైఎస్ హయాంలో కేఎల్ఐ ద్వారా 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని, సింగోటం జాతరప్పుడు కృష్ణానదిలో బోటు మునిగి 60 మంది చనిపోతే ఆయన కొల్లాపూర్ వచ్చి సమీక్షించారని షర్మిల గుర్తుచేశారు వైఎస్ షర్మిల . ఫాంహౌస్ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను కలుస్తారు కానీ, కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను పరామర్శించడానికి పోయేందుకు మనసు రాలేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల.