BREAKING : వైఎస్ విగ్రహాన్ని పగల గొట్టి పశువు అని పించుకున్నారు : వైఎస్ షర్మిల

-

పరకాల నియోజక వర్గం వైఎస్సాటీపీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పాదయాత్రలో భాగంగా సభలో అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జయశంకర్ సార్ కి గౌరవం ఎక్కడ..?, ఆయన పుట్టిన అక్కంపేట ను అవమానించారు కదా..? అని ఆమె ప్రశ్నించారు. ‘స్మృతివణం ఏది..? లైబ్రరీ ఏది..? ఆదర్శ గ్రామం ఎందుకు కాలే..? చల్లా ధర్నా రెడ్డి.. అధర్మా రెడ్డి. పేరులో ధర్మం..చేసేది అధర్మం . వైఎస్ విగ్రహాన్ని పగల గొట్టి పశువు అని పించుకున్నారు. చల్లా ధర్మా రెడ్డి ఇక పశువు. ఈ నియోజక వర్గం ప్రొఫెసర్ జయశంకర్ పుట్టిన గడ్డ. తెలంగాణకు సిద్ధాంత కర్త. తెలంగాణ కు దిశ దశ చూపించిన గొప్ప వ్యక్తి. ఆయన పుట్టిన ఊరు అక్కంపేట లో స్మృతి వణం పెడతా అన్నారు..పెట్టలేదు.

YSRTP Chief YS Sharmila Criticises Cm KCR Over Development Of Telangana DNN  | YS Sharmila: బంగారు తెలంగాణ అని చెప్పి, బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ:  వైఎస్‌ షర్మిల ఫైర్

రాష్ట్రంలోనే అక్కంపెట ఆదర్శ గ్రామం అన్నారు..చేయలేదు. ఒక గ్రంధాలయం అన్నారు..ఇవ్వలేదు. 8 ఏళ్లుగా అక్కంపేట ను పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం అక్కంపేట గ్రామానికి త్రాగడానికి నీరు లేదు. ఈ నియోజక వర్గంలో మూడు పంటలు వేసుకునేందుకు సాగు నీరు ఇస్తా అన్నారు..ఒక్క ఎకరాకు ఇవ్వలేదు. ఈ ఏడాది జనవరి లో అకాల వర్షాలకు 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పట్టించు కోలేదు. కనీసం పరిహారం కూడా లేదు.. సీఎం వస్తా అని చెప్పి మొహం చాటేశారు. 100 శాతం పరిహారం ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పేరు చెప్పి ఆగ్గువ కు భూములు గుంజుకున్నరు. 12 వందల ఎకరాలు తీసుకున్నారు.. 50 లక్షల విలువ చేసే భూమిని 10 లక్షలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు భూములు కావాలని భయపెడుతున్నరు.

 

స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి. ఈయన ధర్మా రెడ్డి కాదు.. అధర్మా రెడ్డి. పేరులో ధర్మం…చేసేది అధర్మం. అక్షరాల 5 వేలకోట్లు ఆస్థులు వెనకేశాడు అంట కదా. ఈయన ఎమ్మెల్యే ముసుగులో ఉన్న బడా కాంట్రాక్టర్ అంట. ఏ కాంట్రాక్ట్ వదలడు..చిన్న పని కూడా వదలడు. మొత్తం లాభాలు ఆయనే తీసుకోవాలి అంట. ఒక భూమి మీద కన్ను పడింది అంటే.. లేని లిటిగేషన్ లు పెడతారట. మళ్ళీ ఈయనే పరిష్కారం అని చెప్పి ఆ భూమిని ఆగ్గువకు కొంటాడు. నియోజక వర్గంలో రోడ్లు మొత్తం అధ్వాన్నంగా మారాయి.’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news