సకల జనుల పోరాట ఫలితమే తెలంగాణ అని…KCR గడ్డాలు పెంచి దొంగ దీక్ష చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయారని…ఉద్యమాన్ని వాడుకుని గద్దె నెక్కారన్నారు. ఉద్యమకారులను రోడ్డునపడేశారని… అమరుల కుటుంబాలను ఆగం జేశాడు.దున్నపోతువా? ముళ్ల కంపవా? శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే పట్టించుకోలె అని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. KCR కూతురు ఓడిపోతే వెంటనే MLC ఇచ్చిండు.బయ్యారం ఉక్కు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం KCR ఎందుకు నోరు విప్పట్లే? అని నిలదీశారు.
కేసీఆర్ అవినీతిపరుడని మోడీ, అమిత్ షా చెప్తున్నారు తప్పా ఎందుకు బయటపెట్టడం లేదు? అని నిలదీశారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే KCR సంకనెక్కారని… KCRకు అధికారమిస్తే తెలంగాణ చెట్టుకు పండ్లు వచ్చాయో, ముండ్లు వచ్చాయో ఆలోచన జేయాలె అని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు మెగా కృష్ణా లాంటి ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చినట్టు? మా తెలంగాణ వాళ్లు కాంట్రాక్టర్లుగా పనిచేయలేరా? అని అగ్రహించారు. మేం అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు సొంతిల్లు,ఉద్యోగం కల్పిస్తాం. స్వరాష్ట్ర సమరయోధులుగా గుర్తించి, వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తామన్నారు.