కరోనాకు భయపడ్డారా..కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన రద్దుపై షర్మిల సెటైర్‌

ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే… ఆకస్మాత్తుగా తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు సీఎంఓ కార్యాలయం ఉదయం ప్రకటించింది. అయితే.. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ టూర్‌ రద్దు కావడంపై వైఎస్‌ షర్మిల సెటైర్లు పేల్చారు. కరోనాకు భయపడి.. టూర్‌ వెళ్లడం లేదా అంటూ చురకలు అంటించారు.

సాయం కోసం రోడ్డెక్కిన రైతన్న ఆగ్రహంతో మిమ్మల్ని అడ్డుకొంటారనా? రైతు చావులకు కారణం మీరేనని మిమ్మల్ని నిలదీస్తారనా? కరోనా వస్తుందనా? లేక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదనా? మీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు దొరగారు? అంటూ ఫైర్‌ అయ్యారు.

పంట వానపాలు రైతు కష్టం కన్నీటిపాలు సాయం దొరమాటలకే చాలుపంట నష్టపోయి,పెట్టిన పెట్టుబడి రాక రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు పురుగుల మందు తాగి చనిపోతుంటే, నష్టపోయిన రైతును ఆదుకోడానికి, రైతును ఓదార్చడానికి ఫామ్ హౌస్ దాటి మీ కాలు బయటపడుతలేదా? అంటూ నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. కష్ట కాలంలో రైతులకు భరోసా ఇవ్వడం చేతకాని_ముఖ్యమంత్రి_మనకొద్దు అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల.