రేపటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు వైఎస్‌ షర్మిల

-

గత వారం రోజుల క్రితం తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వరదలు సంభవించడంతో పలు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అయితే.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 21 నుంచి మూడ్రోజుల పాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉదయం 7 గంటలకు బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆమె పోషయ్యగూడెం, మంచిర్యాలలోని వరదలతో దెబ్బతిన్న కాలనీలను సందర్శిస్తారు వైఎస్‌ షర్మిల.

అనంతరం రామగుండంలోని వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు వైఎస్‌ షర్మిల. ఈ నెల 22న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలకు చేరుకుని మంథనిలో రైతులను వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు. అనంతరం అన్నారం, కన్నేపల్లి పంప్‌ హౌస్‌లను పరిశీలించనున్నారు. అక్కడ్నుంచి జయశంకర్‌భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి, ఆ రాత్రి బయ్యారంలో వైఎస్‌ షర్మిల బస చేస్తారు. ఈ నెల 23న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి బయ్యారం, రెడ్డిపాలెం బూర్గంపహాడ్, భద్రాచలం వరద ప్రాంతాలను వైఎస్‌ షర్మిల సందర్శించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version