జగన్ పై వైయస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు..తల్లిపై కేసు పెట్టావ్… అసలు నువ్వు కొడుకువేనా ? అని ఆగ్రహించారు. జగన్‌కు ఆప్తుల కంటే ఆస్తులే ముఖ్యం మని మండిపడ్డారు షర్మిల. మాజీ సీఎం జగన్‌కు ఆప్తులకంటే ఆస్తులే ముఖ్యమంటూ ఏపీసీసీ ఛీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా పిల్లలకు ఆస్తి ఇస్తున్నట్లు జగనే ప్రకటించారు.

గిఫ్ట్ డీడ్ విజయమ్మకు జగనే చేశారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ ఆ షేర్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని తల్లిపై ఆయనే కేసు వేశారు. నన్ను ప్రభావితం చేసే స్థాయి జగన్ దాటిపోయారు. తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా అతను మిగిలిపోతాడు. ’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.