అవినాశ్‌‌రెడ్డి ద్వారానే నిందితులకు డబ్బు చేరింది – వైఎస్ సునీత

-

అవినాశ్‌‌రెడ్డి ద్వారానే నిందితులకు డబ్బు చేరిందని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ సునీత. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు లో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాశ్‌‌రెడ్డి ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాశ్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని తెలిపారు వైఎస్‌ సునీతా రెడ్డి. ఎంపీ టికెట్ కోసం హత్య చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాశ్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు. ‘‘వివేకా మరణవార్తను మూడోవ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచిచూశారు. వివేకా మరణంపై అవినాశ్‌కు శివప్రకాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చాడు.’ అని సునీతారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version