కాంగ్రెస్ పార్టీని వైయస్సార్ శాపం వెంటాడుతుంది: వైయస్ షర్మిల

-

నేడు వైయస్సార్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైయస్సార్ టిపి స్థాపించిన సంవత్సర కాలంలోనే ఎంతో పురోగతి సాధించింది అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కు వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. వైయస్సార్ ఏ పథకం పెట్టిన ఇందిరా, రాజీవ్ పేరు పెట్టారని, కానీ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీని వైయస్సార్ శాపం వెంటాడుతోందని అన్నారు వైయస్ షర్మిల. హైదరాబాద్ నుంచి సువర్ణ పరిపాలన అందిస్తూనే, ప్రజలకు సేవ చేస్తూనే చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కు గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కి చేసింది ఏంటి? ఆయన ఇచ్చిన అధికారాన్ని అనుభవించారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news