క్రికెట్ లో రికార్డులు నమోదు అవ్వడం మళ్ళీ అవి బద్దలవ్వడం మాములుగా జరుగుతూ ఉంటాయి. ఇక తాజాగా మాజీ ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బ్రేక్ చేశాడు దేశవాళీ క్రికెటర్. 2007 లో టీ 20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఒక ఓవర్లలో 6 సిక్సులు కొట్టి 12 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు మొన్నటి వరకు సేఫ్ గా ఉన్నది. కానీ ఇటీవల జరిగిన ఆసియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీ తొమ్మిది బంతుల్లోనే ఫిఫ్టీ చేసి చెరిపివేశాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు రైల్వేస్ మధ్యన మ్యాచ్ లో… రైల్వేస్ ఆటగాడు అశుతోష్ శర్మ 11 బంతుల్లోనే అర్ద సెంచరీ చేసి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా వరల్డ్ లో సెకండ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ గా రికార్డును అందుకున్నాడు.
ఇక మొదటి స్థానంలో నేపాల్ క్రికెటర్ ఉండగా, రెండవ స్థానంలో ఇండియా, మూడవ స్థానములో ఇండియా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాలలో వెస్ట్ ఇండీస్ గేల్ మరియు ఆఫ్గనిస్తాన్ జాజై ఉన్నారు.