తెలంగాణలోనూ ఓ జిల్లాకు “ఎన్టీఆర్‌” పేరు పెట్టాల్సిందే : టాలీవుడ్‌ దర్శకుడు

తెలంగాణలోనూ ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాల్సిందేనని టాలీవుడ్‌ దర్శకుడు, నిర్మాత వైవీఓస్‌ చౌదరి డిమాండ్‌ చేశారు. విజయవాడ కేంద్రంగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని దర్శకుడు, నిర్మాత వైవీఓస్‌ చౌదరి పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తరహాలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోనూ ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అలాగే.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వలోని కేంద్ర ప్రభుత్వం… ఎన్టీఆర్‌ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరును ఏపీ సర్కార్‌ ఫైనల్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.