యూపీలో జీకా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా మరో కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 6గురు ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు చెందిన వ్యక్తులు ఉండటం గమనార్హం. బుధవారం ఒకే రోజు కొత్తగా 25 జీకా వైరస్ కేసులు బయటపడ్డాయి. మొత్తంగా రాష్ట్రంలో జీకా కేసులు 36కు చేరాయి. కొత్తగా నమోదైన 25 కేసుల్లో 6గురు ఐఏఎఫ్ సిబ్బందిలో పాటు 14 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా కాన్పూర్ లోనే మొత్తం కేసులు కేంద్రీక్రుతం అయి ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 586 రక్త నమూనాను పరీక్షల నిమిత్తం పంపించారు. వీటి ఫలితాలు పూర్తిస్థాయిలో వస్తే మరిన్ని కేసులు నమోాదయ్యే అవకాశం ఉంది.
జీకా వైరస్ అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. యూపీ వైద్యశాఖ ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా దోమల ద్వారా జీకా వైరస్ వ్యాపిస్తుంది. దీంతో కాన్పూర్ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. యూపీలోని కాన్పూర్ లో అక్టోబర్ 23న మొదటి జీకా వైరస్ కేసు బయటపడింది.