గుడ్ న్యూస్‌: భారీగా దిగివ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు..

-

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 39,550 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయలు తగ్గి 36,250 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 300 రూపాయలు తగ్గి 46,400 రూపాయలుగా ఉంది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గి 38,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గి 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీకి ఏకంగా 330 రూపాయలు తగ్గి 46,400 రూపాయల వద్దకు దిగివచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news