అంగారక గ్రహంపై చైనా అడుగు.. ఫోటోలు విడుదల.

-

ఇతర గ్రహాలపై జీవం ఉందా అన్న అన్వేషణలో శాస్త్రవేత్తలు అడుగులు ముందుకు వేస్తున్నారు. మన సౌరకుటుంబంలో అంగారక గ్రహం మీద జీవుల ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అని కనుక్కునేందుకు ఇప్పటికే అమెరికా క్యురియాసిటీ అనే రోవర్ ని పంపించిన సంగతి తెలిసిందే. అంగారక గ్రహం మీద తొలిసారిగా రోవర్ ని పంపించిన ఘనత అమెరికాకే దక్కింది. తాజాగా చైనా కూడా తన రోవర్ ని అంగారక గ్రహం మీదకి పంపింది. ఈ మేరకు రోవర్ ఫోటోలతో పాటు అంగారక గ్రహం మీద రోవర్ తీసిన ఫోటోలను ప్రపంచానికి పంచుకుంది.

చైనా పురాణాల ప్రకారం అగ్నిదేవుడి పేరైనా జురాంగ్ అనే పేరుతో రోవర్ ని అంగారక గ్రహం మీదకి పంపింది. మే 15వ తేదీన అంగారక గ్రహ ఉపరితలాన్ని ఈ రోవర్ తాకింది. ఉపరితలాన్ని చేరుకున్న కొన్ని రోజులకి ఫోటోలను పంపింది. అంగారక గ్రహం మీద ఉపరితలాల ఫోటోలను రోవర్ చిత్రీకరించినట్లు ఫోటోలు బయటకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news