సెర్చ్ ఇంజిన్ లో మనం గూగుల్ నే వాడుతుంటాం.. ఏదైనా డౌట్ వస్తే.. గూగుల్ తల్లిని అడగడమే.. అయితే.. గూగుల్లో మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సర్చ్ చేయడానికే కాదు…గూగుల్ ను మనం ఎంటర్‌టైన్‌మెంట్ గా కూడా వాడుకోవచ్చు. ఆ హిడెన్ సీక్రెట్స్ ఏంటో చూద్దామా..!
Google Gravity: సెర్చ్ బార్‌లో Google Gravity అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వచ్చే రిజల్ట్స్‌లో మొదటి లింక్ క్లిక్ చెయ్యండి. హోమ్ పేజీ ఎలా క్రాష్ అవుతుందో చూడండి.
Do A Barrel Roll: గూగుల్ సెర్చ్ బార్‌లో Do A Barrel Roll అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే స్క్రీన్ 360 డిగ్రీస్‌లో తిరుగుతుంది.
Google Pacman: గూగుల్ సెర్చ్ బార్‌లో Google Pacman అని టైప్ చేస్తే… ప్యాక్ మాన్ డూడుల్ గేమ్ వస్తుంది.
Atari Breakout: గూగుల్ సెర్చ్ బార్‌లో Atari Breakout అని టైప్ చేసి వచ్చే రిజల్ట్స్‌లో మొదటి లింక్ క్లిక్ చేయండి.. మరో గేమ్ వస్తుంది.. ఆడుకోవచ్చు.
Roll A Dice: మీ దగ్గర బోర్డ్ గేమ్ ఉండి.. డైస్ లేకపోతే.. గూగుల్ డైస్ వాడుకోవచ్చు. సెర్చ్ బార్‌లో Roll A Dice అని టైప్ చేసి ఎంటర్ కొడితే డైస్ వస్తుంది. దాన్ని ఎన్నిసార్లైనా రోల్ చేసి ఆడుకోవచ్చు.
Flip A Coin: మీరు కాయిన్ ఎగరవేసి బొమ్మా బొరుసా చూడలానుకుంటే.. మీ దగ్గర కాయిన్ లేకపోతే… గూగుల్‌ని అడగొచ్చు. హోమ్ పేజీలో Flip A Coin అని సెర్చ్ చేస్తే… కాయిన్ వస్తుంది. దాన్ని ఎన్నిసార్లైనా ఫ్లిప్ చేసుకోవచ్చు.
Askew: గూగుల్ సెర్చ్‌లో Askew అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. పై ఫొటోలో లాగా స్క్రీన్ కొద్దిగా వాలుగా కనిపిస్తుంది.
Offline Dinosaur Game: ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది.. గూగుల్ క్రోమ్‌లో ఈ గేమ్ ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ పోయినప్పుడు ఈ గేమ్ ఆడుకోవచ్చు. భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ గేమ్ వల్ల మీరు ఎంత కంగారు మనస్సుగల వారే మీకే అర్థమవుతుంది.
Zerg Rush: గూగుల్‌లో Zerg Rush అని సెర్చ్ చేస్తే వచ్చే మొదటి లింక్ క్లిక్ చెయ్యగానే…ఓ గేమ్ వస్తుంది. సెర్చ్ రిజల్ట్స్‌ని స్మాల్ “o” నాశనం చేయకుండా.. కాపాడటమే ఈ గేమ్ ఉద్దేశం.
వీటన్నింటిని ఇప్పుడే ఓసారి గూగుల్ సర్చ్ బాక్స్ లో ట్రై చేయండి.!