చాలా మంది వాట్సాప్ ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తో మనం ఎన్నో సేవలని పొందొచ్చు. పైగా ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్స్ ని కూడా తీసుకు వస్తుంది. ఇదిలా ఉంటే ఒక్కోసారి వాట్సాప్ లో ఎవరైనా మనల్ని బ్లాక్ చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. వాట్సాప్ లో ఎవరైనా బ్లాక్ చేస్తే ఇలా చూసుకోండి. బ్లాక్ చేశారేమో అని మీకు అనిపిస్తే ఇలా చూడచ్చు.
గ్రూప్ ని క్రియేట్ చేయడం అవ్వదు:
ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారు అని మీకు అనిపిస్తే వారితో మీరు గ్రూప్ ని క్రియేట్ చేయడం అవ్వదు. ఇలా మీరు ఈజీగా బ్లాక్ చేశారేమో అని అనుమానం ఉంటే తెలుసుకోవచ్చు.
కాల్ కనెక్ట్ అవ్వదు:
వాట్సాప్ లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుమానం ఉంటే వాట్సప్ లో కాల్ కనెక్ట్ అవ్వదు.
డబల్ టిక్ కనబడదు:
ఒకవేళ కనుక వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినట్లయితే డబల్ టిక్ కూడా రాదు.
కానీ కొన్ని కొన్ని సార్లు వాట్సాప్ లో ఉన్న ప్రైవసీ ఫీచర్స్ మూలాన ఎవరు బ్లాక్ చేశారు అనేది మనం సులభంగా తెలుసుకోలేము. కాంటాక్ట్ సేవ్ చేసుకోకపోయినా ప్రొఫైల్ పిక్చర్ కనపడదు. అలానే ప్రైవసీ ఫీచర్ ద్వారా డబల్ టిక్స్ రావు. అలానే లాస్ట్ సీన్ కనపడదు. కానీ గ్రూప్ ని క్రియేట్ చేయడం కాల్ చేయడం ద్వారా మీరు ఎవరైనా బ్లాక్ చేసారా లేదా అనేది చూసుకోవచ్చు.