త్వరలోనే MacBook Air M2 ప్రీ ఆర్డర్లు..ఫీచర్స్‌ ఇవే..!

-

మార్కెట్‌లో ఎన్ని ల్యాప్‌టాప్స్‌ ఉన్నా.. యాపిల్‌ బ్రాండ్‌కు ఉన్న రేంజే వేరు. యాపిల్‌ సర్‌ యాపిల్‌ అంతే. తాజాగా యాపిల్‌ నుంచి MacBook Air M2 ప్రీ ఆర్డర్లు త్వరలో ప్రారంభంకానున్నాయి. WWDCలో లాంచ్ చేసిన ఆపిల్ మ్యాక్ బుక్ ఇండియాకు వస్తోంది. ల్యాప్‌టాప్‌ ఫీచర్సు, కాస్ట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.
MacBook Air M2 ప్రీ-ఆర్డర్లు జూలై 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ తయారీదారు ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను స్పీడ్ M2 చిప్‌తో జూన్‌లో WWDC 22లో లాంచ్ చేసింది. జూలై 8 నుంచి ఇండియాలో MacBook Air M2ని ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ ఆర్డర్‌ చేయవచ్చు.

MacBook Air M2 ధర, స్పెసిఫికేషన్లు…

కొత్త MacBook Air M2 బేస్ ప్రారంభ ధర రూ.1,19,900గా ఉండనుంది.
8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వినియోగదారులు MacBook Air M2 బేస్ కాన్ఫిగరేషన్ 8-కోర్ CPU, 8-కోర్ GPUని పొందవచ్చు.
గరిష్టంగా 24GB RAMతో పాటు 2TB ఇంటర్నల్ స్టోరేజీతో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
హై-ఎండ్ ఆప్షన్లలో 8-కోర్ CPU, 10-కోర్ CPUని కూడా అందిస్తోంది ఆపిల్.
ప్రీ-ఆర్డర్‌లు జూలై 8న సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమవుతాయి.
Apple ఇండియా ఆన్‌లైన్ స్టోర్, Apple సంబంధిత ఇతర ఛానెల్‌ల ద్వారా జూలై 15 నుంచి కొనుగోలుకు MacBook Air M2 అందుబాటులో ఉంటుంది. MacBook Air M2 సరికొత్త డిజైన్‌తో రానుంది.
మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ల ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌తో వస్తోంది. డిస్‌ప్లే పైభాగంలో వైడ్ నాచ్‌ను కలిగి ఉంటుంది.
Apple 8 CPU కోర్స్, 10 GPU కోర్లతో కొత్త M2 చిప్‌తో రానుంది.
కొత్త చిప్ 18శాతం వేగవంతమైన పనితీరుతో పాటు 35 శాతం వరకు పవర్‌ఫుల్ GPUని అందిస్తుందని పేర్కొంది.
స్క్రీన్ 13.6-అంగుళాల వద్ద కొంచెం పెద్దదిగా ఉండనుంది.
500 నిట్‌ల గరిష్ట బ్రైట్ నెస్ అందిస్తుంది. లిక్విడ్ రెటినా డిస్‌ప్లే పైన అప్‌గ్రేడ్ 1080p వెబ్‌క్యామ్ కూడా ఉంది.

స్పెషల్‌ బెనిఫిట్స్‌ ఇవే..

MagSafe ఛార్జింగ్ పోర్ట్, 2 USB టైప్-C పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంటుంది.
8-కోర్ GPU వేరియంట్ 30W ఛార్జర్‌తో వస్తోంది. అయితే 512GB SSDతో 10-కోర్ GPU వేరియంట్, 35W డ్యూయల్ USB టైప్-C అడాప్టర్‌తో వస్తుంది.
35W డ్యూయల్ USB Type-C అడాప్టర్‌కు బదులుగా 67W USB టైప్-సి ఫాస్ట్ ఛార్జర్‌కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని Apple యూజర్లకు అందిస్తుంది.
ఈ కొత్త MacBook Air M2 ఒకసారి ఛార్జ్ చేస్తే.. 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. మాకోస్ మాంటెరీతో రన్ అవుతుంది.
ఈ ఏడాది చివర్లో కొత్త macOS Venturaను ఆపిల్ తీసుకురానుంది.
కొత్తగా..మ్యాక్‌బుక్‌ తీసుకోవాలనుకునే వారు లేటెస్ట్‌ వర్షన్‌గా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news