చైనాలో లాంచ్‌ అయిన Honor X8 5G.. స్పెసిఫికేషన్స్‌ ఇవే..!

-

హానర్‌ నుంచి ఎక్స్‌8 5G స్మార్ట్‌ ఫోన్‌ చైనాలో విడుదలైంది. ధరను ఇంకా కంపెనీ ప్రకటించలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్‌ ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇంకా ఈ ఫోన్‌ వివరాలు ఇలా ఉన్నాయి…

హానర్ ఎక్స్8 5జీ ధర..

ఈ స్మార్ట్ ఫోన్ ధర ఇండియాలో రూ. 13,999 గా ఉంటుందని అంచనా..
మిడ్‌నైట బ్లాక్, ఓషన్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

హానర్ ఎక్స్8 5జీ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు.
పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ ఫీచర్ కూడా ఉన్నాయి.
ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 402 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ ఎక్స్8 5జీ పని చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 22.5W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు.
ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఉంది. డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైదు, గ్లోనాస్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news