చైనాలో లాంచ్‌ అయిన Vivo X Fold Plus స్మార్ట్‌ ఫోన్..

-

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల అయింది.ఈ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ఇన్నర్ డిస్‌ప్లేను అందించారు. దీని ధర కూడా లక్ష దాటింది.. త్వరలో మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. కవర్ డిస్‌ప్లేగా 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ ధర..

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 యువాన్లు అంటే సుమారు రూ.1,15,000 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 10,999 యువాన్లుగా సుమారు రూ.1,25,000 ఉంది.
బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

వివో ఎక్స్ ఫోల్డ్ ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఇందులో 8.03 అంగుళాల అమోఎల్ఈడీ ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 2కే ప్లస్‌గా ఉంది. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం.
దీంతోపాటు 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లేను కూడా అందించారు.
గేమో మోడ్ ద్వారా రిఫ్రెష్ రేట్‌ను 120 హెర్ట్జ్ నుంచి 140 హెర్ట్జ్, 240 హెర్ట్జ్‌కు పెంచుకోవచ్చు.
12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 4730 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ ఫోన్ మందం మడిచినప్పుడు 1.49 సెంటీమీటర్లు గానూ, ఓపెన్ చేసినప్పుడు 0.74 సెంటీమీటర్లుగానూ ఉంది.
బరువు దాదాపు 311 గ్రాములు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫేషియల్ రికగ్నిషన్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఇందులో అందించారు.
5జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్‌లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news