ఇండియాలో విడుదలైన Itel A23s.. ధర రూ. 6వేల లోపే..!

-

చైనీస్‌ బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ.. ఐటెల్ నుంచి ‘Itel A23s’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఇండియన్‌ మార్కెట్లో విడుదల అయింది. బెస్ట్‌ బడ్జెట్‌ ఫోన్‌. ధర ఆరు వేల లోపే ఉంది. Itel A23s స్మార్ట్‌ఫోన్ ఒక దశాబ్దం క్రితం నాటి పాత ఆండ్రాయిడ్ హ్యాండ్ సెట్లను గుర్తుకు తెచ్చే సరళమైన డిజైన్‌న్‌తో ఉంది. Itel A23sలో ఫిజికల్ టచ్ నావిగేషన్ బటన్‌లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 6 వేల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.. ధరను బట్టే చెప్పేయొచ్చు.. స్పెసిఫికేషన్స్‌ పెద్దగా ఉండవు అని.. నార్మల్‌గా ఫోన్‌ వాడేవాళ్లకు మాత్రం కచ్చితంగా ఈ ఫోన్‌ మంచి ఎంపికే..
Itel A23s ధర..
ఈ ఫోన్‌ ధర రూ. 5,299/-గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ స్కై సియాన్, స్కై బ్లాక్, ఓషన్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసిన 100 రోజులలోపు కస్టమర్లకు వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
Itel A23s స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. 
ఇది 4G VoLTEకు సపోర్ట్ చేస్తుంది.
ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని మైక్రో SD కార్డ్ ద్వారా 128 GB వరకు పెంచుకోవచ్చు.
ఈ ఫోన్ ద్వారా మీరు WhatsApp కాల్స్‌ను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ ఫోన్‌లోనే ఇన్-బిల్ట్ గా WhatsApp కాల్ రికార్డింగ్, పీక్ మోడ్, కాల్ అలారం, స్టేటస్ సేవింగ్‌కు సపోర్ట్ చేసే ప్రత్యేకమైన సోషల్ టర్బో ఫంక్షన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ఎక్కువ ధర ఉన్న ఫోన్లలో కూడా ఈ ఆప్షన్‌ ఎక్కువగా లేదు.
5 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు.
2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.
యూనిసాక్ SC9832E క్వాడ్-కోర్ ప్రాసెసర్పై నడుస్తుంది.
వెనకవైపు 2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో VGA సెల్ఫీ షూటర్‌ అందించారు.
రెండువైపులా LED ఫ్లాష్ ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఫోన్‌ పనిచేస్తుంది.
3020 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news