జపాన్‌లో లాంచ్‌ అయిన Oppo Reno 7A..హైలెట్స్‌ ఇవే..!

మార్కెట్‌లో స్మార్ట్‌ ఫోన్లకు కొదవే లేదు. కంపెనీలు ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేలా వెరైటీ ఫీచర్స్‌తో బడ్జెట్‌ ఫోన్లు తీసుకొస్తుంటాయి. మార్కెట్‌లో ఉన్న ప్రతీ ఫోన్‌ ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ ఆ ఫీచర్స్‌, ఒక దానికి మరొకదానికి మధ్య తేడా తెలిసినప్పుడే మనం మోసపోకుండా ఉన్న బడ్జెట్‌లో బెస్ట్‌ ఫోన్‌ తీసుకోవచ్చు. తాజాగా ఒప్పో జపాన్‌లో ఒప్పో రెనో 7A స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇది ఒక మిడిల్‌ రెంజ్‌ ఫోన్ అని చెప్పవచ్చు. అటు బడ్జెట్‌ కాదు, ఇటు లగ్జరీ కాదు.. మరీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.!

ఒప్పో రెనో 7ఏ ధర..

దీని ధరను 44,800 జపాన్ యెన్‌లుగా (సుమారు రూ.26,000) నిర్ణయించారు.
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.
స్టారీ బ్లాక్, డ్రీమ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 7ఏ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080×2400 పిక్సెల్స్‌గా ఉంది. ఈ డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ర్యామ్‌ను 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంను ఒప్పో రెనో 7ఏ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా… 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

కెమెరా క్వాలిటీ..

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను వెనక అందించారు. సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం.. 16 మెగాపిక్సెల్ కెమెరాను ముందువైపు అందించారు. ఒప్పో రెనో సిరీస్‌కు మనదేశంలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. కాబట్టి త్వరలోనే ఇది ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.