లాంచ్‌ అయిన Samsung Galaxy F04.. స్పెషల్‌ ఆఫర్‌ కొద్దిరోజులే..!!

-

కొత్త సంవసత్సరంలో శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్. ఇది ఒక బడ్జెట్‌ రేంజ్‌ మొబైల్.. ఒక్కవేరియంట్‌లోనే లాంచ్‌ ఈ ఫోన్‌ ధర ఎనిమిది వేల లోపే ఉంది. స్టోరేజ్‌ మాత్రం 64జీబీ ఇచ్చారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. దీన్ని స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ తెలిపింది. అయితే ఎన్ని రోజులు ఈ ధరకు విక్రయిస్తారో తెలియరాలేదు.
జేడ్ పర్పుల్, ఓపెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
జనవరి 12న ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్.కాం వెబ్‌సైట్లలో దీని సేల్ జరగనుంది.

ఐసీఐసీఐ కార్డుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ వస్తుంది. అంటే రూ.6,499కే ఈ ఫోన్‌ను దక్కించుకోవచ్చన్న మాట.
నెలకు రూ.330 నుంచి ఈ ఫోన్ ఈఎంఐ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ బడ్జెట్ ఫోన్ పని చేయనుంది.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు.
వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఈ ఫోన్‌లో ఉంది.
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 పని చేయనుంది.
5000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీ కూడా ఈ ఫోన్‌లో ఉంది.
4 జీబీ ర్యామ్ ఈ ఫోన్‌లో ఉంది.
ర్యామ్ ప్లస్ ఫీచర్‌ను అందించారు.
దీని ద్వారా ర్యామ్‌ను మొత్తంగా 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది.
మైక్రో ఎస్‌డీ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 188 గ్రాములుగా ఉంది.

ఇక కెమెరా విషయానికి వస్తే..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news