లాంచ్‌ అయిన Sony Xperia 5 IV.. కెమెరా క్వాలిటీలో యాపిల్‌తో పోటీ..!

-

సోనీ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. అదే సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ స్మార్ట్ ఫోన్. ఎంపిక చేసిన దేశాల్లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. యూకే, యూరప్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇందులో 6,1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ ఇలా ఉన్నాయి…
సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ ధర..
ఈ ఫోన్ ధర యూరోప్‌లో 1,049 యూరోలుగా (సుమారు రూ.83,700) ఉంది.
యూకేలో దీని ధరను 949 పౌండ్లుగా (సుమారు రూ.87,600) నిర్ణయించారు.
ఇక అమెరికాలో దీని ధర 999.99 డాలర్లుగా (సుమారు రూ.79,600) ఉంది.
బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
సోనీ ఎక్స్‌పీరియా 5 ఐవీ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ+గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 21:9 కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా దీన్ని చార్జింగ్ పెట్టవచ్చు.
వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, అడాప్టివ్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పెట్టవచ్చు.
దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 172 గ్రాములుగా ఉంది.
బ్లూటూత్ వీ5.2, ఏ-జీపీఎస్, 5జీ, 4జీ ఎల్టీఈ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే… 
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో రెండు 12 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news