ఇండియాలో లాంచ్‌ అయిన Vivo T1 5G సిల్కీ వేరియంట్..!

-

వివో టీ1 5జీలో సిల్కీ వైట్ వేరియంట్ భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. వివో టీ1 5జీ మనదేశంలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ అయింది. ఈ ఫోన్‌ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్‌ అయింది. ఇప్పుడు వచ్చిన వేరియంట్‌ స్పెషల్‌..ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

వివో టీ1 5జీ సిల్కీ వైట్ వేరియంట్ ధర..
వివో టీ1 5జీలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990గా ఉంది.
ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గా ఉంది.
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990గానూ నిర్ణయించారు.
ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో కూడా వివో టీ1 5జీని కొనుగోలు చేయవచ్చు.

వివో టీ1 5జీ సిల్కీ వైట్ వేరియంట్ స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్695 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి.
యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, వర్చువల్ గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే..

ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news