గుప్పెడంతమనసు 274: దేవయానితో ఓ ఆట ఆడుకున్న జగతి..రిషీ చేతులుపట్టుకుని ఏడ్చేసిన వసుధార

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, రిషీ కాలేజ్ కి వస్తారు. మహేంద్ర రిషీ నువ్వెళ్లు..నేనొక ఫోన్ మాట్లాడి వస్తాను అంటాడు. రిషీ ఓ లుక్ ఇస్తాడు. అంటే గుడ్ మార్నింగ్ చెప్పి అంటాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలంటే మెసేజ్ పెట్టొచ్చుకదా అంటాడు. సర్లే మీ ఇష్టం అని రిషీ వెళ్లిపోతాడు. మహేంద్ర జగతికి ఫోన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ జగతి అని ఏంటి లేట్ ఇంకారాలేదు అంటాడు. ముందువెళ్తున్న రిషీ అన్నీ చూస్తాడు. జగతి నేను ఈరోజు రావటంలేదు అంటుంది. మహేంద్ర ఒంట్లోబాలేదా, హాస్పటల్ కి వెళ్దామా అంటాడు. అవసరంలేదు మహేంద్ర అని జగతి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో శిరీష్ వసూ వస్తారు. మహేంద్ర, రిషీ ఇద్దరూ చూస్తారు. శిరీష్ వసూతో నేను చెప్పింది గుర్తుందికదా..వసూ నాకు వేరేదారికనిపించటంలేదు అంటాడు. వసూ శిరీష్ ఆలోచించుకునే టైం కూడా ఇవ్వవా అంటుంది. శిరీష్ వసూ చేతులు పట్టుకుని ప్లీజ్ అంటాడు. నువ్వు చెప్పేది చెప్పావ్ వెళ్లు అంటుంది. నా లైప్ నీ చేతుల్లోనే ఉంది అని శీరిష్ అంటాడు. దూరంగా నిలబడ్డ మహేంద్ర, రిషీకి మాటలు వినకపడకపోయినా..ఏదో తేడాగా ఉందని అర్థమవుతుంది.

ఇంట్లో దేవయాని ధరణి దగ్గరకు వచ్చి నేను బయటకువెళ్తున్నాను అని చెప్తుంది. ధరణి కారు సర్వీసింగ్ కి ఇచ్చారుగా అని రకరకాల ప్లాన్స్ చెప్తుంది. నేను నీ దగ్గర పర్మిషన్ కోసం రాలేదు. నేను పనిమీద బయటకువెళ్తున్నా ఎ‌వరైనా అడిగితే చెప్పు అంటుంది. కాలేజ్ లో వసుధార ఉషాతో శిరీష్ ఓ పెద్ద బాంబ్ పేల్చాడు, నన్ను ఇరకాటంలో పడేశాడు అంటుంది. అప్పుడే రిషీ వెనకనుంచి వస్తుంటాడు. శిరీష్ ఏం చెప్పాడో ఉషాకి చెప్తుంది. అది రిషీ వింటాడు. కానీ మనకు వినిపించరు. శిరీష్ మంచివాడు పుష్పా, మంచి జాబ్ చేస్తున్నాడు, ఇంతకంటే ఏ ఆడపిల్లైనా ఏం కోరకుంటుంది, ఎవరూ కాదనుకోరు కదా అంటుంది. అప్పుడే రిషీ చేతిలో కీ ందపడుతుంది. వసూ చూస్తుంది. రిషీ వెళ్లిపోతాడు. మహేంద్ర కూడా ఉంటాడు.

ఇంకోసీన్ లో జగతి రిషీ ఇంటర్వూ చూసుకని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే దేవయాని ఎంట్రీఇస్తుంది. ఎడమకాలు ఎత్తిపెట్టిమరీ లోపలికి వస్తుంది దేవయాని. ఏం జగతి ఎలా ఉన్నావ్, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నేను కోరుకున్నట్లు నీచేతనే ఇంటర్వూలో నిన్ను తొలగించాను అంటూ స్వీట్స్ ఇస్తుంది. బలవంతంగా పెడుతుంది. జగతి ఏం మాట్లాడదు. కాసేపటికి అక్కయ్యా మీ ఆనందాలు నీవి,నా ఆనందాలు నావి అని ఒక ఉదాహరణ చెప్తుంది. ఇలా చెప్తూ ఉండగా..రిషీ దేవయానికి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ జగతి లిఫ్ట్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేస్తుంది. దేవయాని దిమ్మతిరగిపోతుంది. రిషీ మీరు క్యాబ్ లో వెళ్లారంటగా, నాకు చెప్తే కారు పంపించేవాడ్ని కదా అంటాడు. జగతి అక్కయ్యా అంటూ కావాలనే దేవయానిని ఇరికిస్తుంది. ఇంటర్వూలో మీరు బాగా మాట్లాడారని నాకు స్వీట్స్ తీసుకొచ్చారు. ఇంటర్వూ విజయాన్నిమీరు నాకు అంకితం చేశారుకదా మీరే పంపారు అనుకున్నాను అంటది జగతి. రిషీ పెద్దమ్మకు ఫోన్ ఇవ్వండి అని దేవయానితో మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు అంటాడు. దేవయాని ఏదో చెప్పి కవర్ చేస్తుంది. వెంటనే వచ్చేయండి కారు పంపిస్తున్నాను అంటాడు.

జగతి మీరు ఇక్కడ ఉండటం నా కొడుక్కేకాదు నాకు కూడా ఇష్టం ఉండదు అని జగతి చాలా గొప్పగా మాట్లాడుతుంది. ఈ సీన్ చాలా బాగుంటుంది. ఇంకోసీన్ లో రిషీ క్లాస్ చెప్తూ ఉంటాడు. వసూ ఫోన్ లో రిషీకి పంపిన మెసేజ్ చూస్తుంది. రిషీ చూసి వసుధార ఏం చేస్తున్నావ్ అంటే ఏంలేదు సార్ అంటుంది వసూ. రిషీ ఇక్కడికిరా అని ఈ లెక్కను పూర్తిచెయ్ మంటాడు. రిషీ వెళ్లి వసూ బెంచ్ లో కుర్చుంటాడు. వసూ ఫోన్ అక్కడే ఉండటంతో..చూసి ఈ పొగరేంటి ఇప్పుడు ఈ మెసేజ్ సే చూస్తుంది అనుకుంటాడు.

వసూ బోర్డుపైన లెక్కచేయమంటే సారీ సార్ అని రాస్తుంది. క్లాస్ లో అంతా అయిపోయింది వసూ ఈరోజు అనుకుంటారు. రిషీ చూస్తాడు ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో వసూ ఏడుస్తూ రిషీ చేతులుపట్టుకుని మీకు కోపం వస్తే ఏదైనా అనండి..అంతేకాని నాతో మాట్లాడుకుండా ఉండకండి సార్ అంటుంది. వసూ ఏంటిది ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావ్ అంటాడు. మీరు నాతో మాట్లాడకుండా ఉండటంకంటే పెద్ద శిక్ష ఏం ఉండదు సార్ అంటుంది వసూ. రిషీ నువ్వెప్పుడు నాతోనే..నా పక్కనే ఉండాలి వసుధార అంటాడు రిషీ. చూద్దాం వసూ ఏం చెప్తుందో.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version