గుప్పెడంతమనసు ఎపిసోడ్ 339 : వసూకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసిన రిషీ..అసలు విషయం చెప్పేలోపే అడ్డొచ్చిన గౌతమ్

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్లో ఉన్న గౌతమ్ రిషీకి వసూతో దిగిన సెల్ఫీ చూపిస్తాడు. ఏంట్రా ఇది అంటే..సెల్ఫీ కానీ సెల్ఫీ అంటాడు గౌతమ్. తనకు చెప్పకుండా ఫొటో తీయడం సరికాదన్న రిషి ఫోన్ లాక్కుని ఫొటో డిలీట్ చేస్తాడు. గౌతమ్ ఏం చేస్తున్నావ్ రా అంటే..డిలీట్ చేశాను అంటాడు రిషీ. మిత్రద్రోహి అని తిట్టిన గౌతమ్.. స్నేహం కోసం ప్రాణం ఇస్తార్రా కొందరు అని గౌతమ్ అంటే..స్నేహితులు చేసిన చెత్తపనులను వ్యతిరేకిస్తారు నాలాంటి కొందరు అంటాడు రిషి. ఇలా చెప్పకుండా వసుధారకి చెప్తే..నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అంటాడు రిషీ. అప్పుడే వసుధార వస్తూ ఉంటుంది. రేయ్ రేయ్ చెప్పకురా..కావాలంటే నీకు కాఫీ పార్టీ ఇస్తాను అంటాడు. సరిగ్గా అప్పుడే వచ్చిన వసూ ఏంటి సార్ ఏదో పార్టీ అంటున్నారు అంటే..రిషీ కావాలనే ఏంట్రా ఏదో అన్నావ్.. మళ్లీ చెప్పు, ఇంతకీ పార్టీ ఎందుకు ఇస్తున్నావ్ అని అడుగుతాడు. గౌతమ్ బుద్ది తక్కుకవై..డబ్బులు ఎక్కువై అంటాడు.

సీన్ కట్ చేస్తే..గౌతమ్ తాను గీస్తున్న బొమ్మ సరిగా రావడం లేదంటాడు. రిషీని అడుగుతాడు.. మనసులో ఉండే రూపం పేపర్ పై ఆటోమేటిగ్గా ప్రవహిస్తుంది అంటాడు రిషి. ఆ కళ్లు చూడాలంటే మనకళ్లు అదృష్టం చేసుకోవాలి అని గౌతమ్ అంటే..అంటే నువ్వు చేడలేదమనాటు అంటాడు రిషీ. ఆర్ట్ ని ఆర్టిఫిషియల్ చేయకురా….ఏకాగ్రత లేనప్పుడు ఏపనీ చేయకూడదు..అందులోనూ ఈ పని అసలు చేయకూడదంటాడు. నువ్వు ఎప్పుడూ ఎంకరేజ్ చేయవు అని మనోడు సీరియస్ గా ట్రై చేస్తాడు. కానీ ఎంత ట్రై చేసినా రాదు..నా వల్ల అయ్యేట్లు లేదు అని వెళ్లిపోతాడు. రిషీ వీడి గోల ఏంటి..కళ్లు కళ్లు అని కలవరిస్తున్నాడు అని రిషీ డ్రాయింగ్ స్టాండ్ దగ్గరకు వెళ్లి..అందమైన కళ్లు అంటే ఏవి అనుకుని కళ్లుమూసుకుంటే..వసుధార కళ్లు కనిపస్తాయి. రిషీ నాకు వసుధార కళ్లు ఎందుకు గుర్తుకువస్తున్నాయ్ అనుకుని..తను డ్రా చేయడం మొదలుపెడతాడు. వసుధార ఊహల్లో ఆమె బొమ్మ గీస్తాడు. అది కాస్త వసూ ఫోటోనే అవుతుంది. ఏంటి వసుధార బొమ్మగీశఆను అనుకుని షాక్ అవుతాడు. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది.

తెల్లారి..సోఫాలో పడుకున్న వసు చేతిలో బుక్ తీసి టేబుల్ పై పెడుతూ..కిందపడిన నెమలి ఈక చూస్తుంది జగతి. ఏంటి వసూ నీకు ఈ చిన్న పిల్లల చేస్టలు, అప్పుడే ధైర్యంగా ఉంటావ్, అప్పుడే చిన్న పిల్లలా మారిపోతావ్, రిషిలాగే నువ్వు కూడా అర్థం కావు..నిద్రలేపాలా కాసేపు పడుకునిద్దామా అనుకుని వద్దులే అని అక్కడి నుంచి వెళ్లిపోయిన జగతి.. జంట నెమలీకలు ఉన్న బాటిల్లో మూడోది పెట్టి..జంట అంటే రెండే కదా రెండే బావున్నాయని ఒకటి తీసేస్తుంది.

రిషీ ఇంట్లో..

పేపర్ చదువుతున్న రిషికి కాఫీ ఇస్తుంది ధరణి. గుడ్ మార్నింగ్ మిత్రమా అంటూ ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. కాఫీ తీసుకుందామని గౌతమ్ అనుకునే లోగా ఇది నా కాఫీ అంటూ తీసుకుంటాడు రిషి. వదినా వాడికి వేరే కాఫీ ఇవ్వండి అంటాడు. ఇది నాకే రాసుందని త్యాగం చేసెయ్ అన్న గౌతమ్ తో..ఈ కాఫీపై నీ పేరు లేదు..త్యాగం చేయడానికి కూడా కొన్ని పద్ధతులుంటాయంటాడు. పోనీ షేర్ చేసుకుందామా అంటే… అన్నీ షేర్ చేసుకోలేం అని రేయ్ అన్నీ షేర్ చేసుకోలేం..జీవితంలో నీకొచ్చేది నీకు వస్తుంది..నీది కానిది ఎంత తపించినా నీకు రాదంటాడు రిషి. పొద్దున్నే విచిత్రంగా మాట్లాడుతున్నావ్ అన్న గౌతమ్ తో..పొద్దున్నా, సాయంత్రం అని తేడాలు నీకు ఉంటాయేమో..నాకు ఉండవు, సమయం సందర్భాన్ని బట్టి నేను పద్ధతి మార్చుకోను, నువ్వే కొన్ని పద్దతులు మార్చుకోవాలి అంటాడు రిషి. నువ్వు మాట్లాడుతున్నది కాఫీ గురించేనా అన్న గౌతమ్ తో..నీకు ఎలా అర్థమైతే అలా అన్న రిషి.. వదినా కాఫీ బాగుంది అంటే..బాగున్నా కాఫీ నాకు దక్కకుండా చేశావు అని గౌతమ్ అంటే..నువ్వెంత గింజుకున్నా నీకు దక్కాల్సింది నీకు దక్కుతుందంటాడు. ఇలా వీళ్లిద్దరు తిట్టుకుంటూ పొగుడుకుంటూ ఉంటారు.. నేను కాలేజీకి వెళుతున్నా.. నీ సంగతి నీ ఇష్టం అనేసి రిషి వెళ్లిపోతుంటే..నువ్వెక్కడికి వెళితే నేను కూడా అక్కడికే అంటాడు గౌతమ్. అయినా..రిషీ వినకుండా వెళ్లిపోతాడు. ఏంటో రిషి..అస్సలు అర్థంకాడు అనుకుంటాడు గౌతమ్.

కార్లో జగతి- వసుధార

కార్లో కాలేజీకి వెళుతుండగా..వసు నువ్వు హాల్లో పడుకున్నావేంటని అడుగుతుంది జగతి. చదువుతూ చదువుతూ.. అలాగే నిద్రపోయా అన్న వసుతో..నీకు చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకున్నానే అంటుంది జగతి. వసూ నాకెప్పుడు అలా తగ్గదు అంటుంది వసూ. ఈ వారంలో మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మెయిల్స్ అవి చెక్ చేయాలి..మీ ఎండీ గారికి చెప్పు అన్న జగతితో..మన ఎండీగారు అనండి మేడం అంటుంది వసు. వసూ అంతేలా వసూ..నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎండీగారు అవుతారు..లేనప్పుడు నా కొడుకు అవుతాడు అంటు చురక అంటిస్తుంది జగతి. మేడం మిషన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వర్క్ కూడా చాలా పెండింగ్ పడింది..అది కూడా పూర్తిచేయాలి అన్న వసుతో..నువ్వు తలుచుకుంటే అయిపోతుందిలే నువ్వు చెబితే రిషి కాదంటాడా ఏంటి అంటుంది జగతి. ఇంతలో ఆ కారుని ఫాలో అవుతూ వెనకే వస్తుంటాడు గౌతమ్. కాలేజీలో కారు దిగిన రిషి..ఇంట్లో గీసిన వసు బొమ్మని, వసుని తలుచుకుంటూ వసుధార ఇంకా రాలేదా అనుకుంటూ అక్కడే ఉన్న పుష్ప దగ్గరకు వెళ్లి అడుగుతాడు మనసులో నాకు తెలుసు.తను వచ్చి ఉండదు..ఈ మధ్య చాలా లేటొస్తుంది అనుకుంటాడు.. లైబ్రరీకి వెళ్లిందని పుష్ప చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎపిసోడ్ ముగిసింది…

రేపటి ఎపిసోడ్ లో

వసుకి రోమియో జూలియట్ బుక్ ఇస్తాడు రిషి.. వసూ అది తీసుకుని..కాలేజిలో మెట్లదగ్గర కుర్చోని చదువుతూ..సార్ నాకు ఈ బుక్ ఎందుకు ఇచ్చారు అనుకుంటుంది. అప్పుడే రిషీ వచ్చి ప్రేమ అంటే ఏంటో అర్థమైందా అంటాడు. కరెక్టుగా అదే టైంకి..గౌతమ్ వచ్చి..లవ్, ఇష్క్, కాదల్ అని వాళ్ల మధ్య కుర్చుంటాడు.

-Triveni Buskarowthu