కార్తీకదీపం 1213 ఎపిసోడ్: కథలో ఊహించని ట్విస్ట్..నెగిటివ్ క్యారెక్టర్లో శ్రావ్య..పేషెంట్ ను హత్య చేసిన కార్తీక్..మళ్లీ కేసులు, కోర్టులే

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప, సౌందర్య కార్తీక్ బాధను తలుచుకుని బాధపడుతుంటారు. సౌందర్య కొడుకు పరిస్థితిని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. దీప ధైర్యంగా ఉండండి అత్తయ్య్, మోనిత పొగరు ఎలా అనచాలో నాకు వదిలేయండి అత్తయ్య అంటుంది. సౌందర్య ఇదే మాటమీద ఉండవే..మీ ఇద్దరి పెళ్లైన దగ్గరినుంచి ఆనందంగా ఉన్నది ఎప్పుడే..ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే మీ ఇద్దరు విడిపోయారు, ఇప్పుడు ఈ మోనిత..పాపం వాడు ప్రశాంతంగా ఎప్పుడు ఉన్నాడే అని మావయ్యగారు పడుకున్నారా దీప అంటే..టాబ్ లెట్స్ ఇచ్చాను అత్తయ్య ఇంతకముందే అంటుంది దీప. ఎన్ని కష్టాలు ఉన్నా నీ ధర్మాన్ని మాత్రం నువ్వు మర్చిపోవు, నువ్వు గ్రేట్ దీప అంటుంది సౌందర్య. వీలైతే నన్ను క్షమించవే అంటుంది సౌందర్య..దీప మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి అంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు.
karthika-deepam
కట్ చేస్తే తెల్లారి మార్నింగ్ మోనిత ఇంట్లో ప్రియమణి సామాన్లు అన్నీ..చెల్లాచెదరుగా పడేస్తుంది. మోనిత వచ్చి ఏంటి ప్రియమణి ఇదంతా అంటే..నేనే చేశాను అమ్మా నాకు కోపం వస్తుంది. వాళ్లు మిమ్మల్ని అన్నన్ని మాటలు అన్నారు..మీకు ఏం కోపం రావటం లేదా..కానీ ఏం జరగట్లు ఉండటం నావల్ల కావటం లేదమ్మా..మీకు చీము నెత్తురు, రోషం పౌరషం ఏం లేవా అంటుంది ప్రియమణి. మోనిత కొట్టడానికి చేయి పైకి ఎత్తుతుంది. కొడతారా కొట్టండి అంటుంది ప్రియమణి. ప్రియమణి చెడామెడా తిడుతుంది..ఏదో ఒకటి చేయండమ్మా, ఇలా అయితే నేను మీ దగ్గర పనిచేయలేను. నచ్చలేదమ్మా నాకు నచ్చలేదు అని వెళ్లిపోతుంది. మోనిత వచ్చి నా బంగారుకొండ..ఏమనుకుంటున్నావ్ ప్రియమణి..మోనిత మారిపోయింది అనుకుంటున్నావా..ప్రతిదానికి సమాధానం చెప్పి తీరతాను, ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను. దీపే నా లోకం, దీపే నా ప్రపంచం అని బారసాల రోజు చెప్పిన కార్తీక్ కి నేలమీదకు దింపుతాను..మోనిత నువ్వే కావాలి అని కార్తీక్ నా చుట్టుతిరిగేలా చేస్తాను అంటుంది. నమ్మమంటారా అమ్మా అంటే..నమ్ము ప్రియమణి అంటుంది మోనిత.
మరోపక్క హాస్పటల్ లో ఇద్దరు పిల్లలతో ఒక ఆ‌విడ తన భర్తకు గుండెనొప్పి వచ్చిందని ఏడుస్తుంది. కార్తీక్ ఆపరేషన్ చేస్తాను, ఏం కాదు అన్నా..ఆ‌విడ మాత్రం తెగా లాగ్ చేస్తుంది. ఆయనకేం కాదు అన్నా వీళ్లు డాక్టర్ బాబు కాళ్లుమొక్కుతారు. ఆ సీన్ అక్కడితో అయిపోతుంది. ఇంట్లో సౌందర్య ఏంటో గేట్ దగ్గర నుల్చుని కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మోనిత ఏమైనా గొడపపడిందా అని కంగారు పడుతుంది. ఇంతలో కారులో శ్రావ్య వస్తుంది. శ్రావ్య వచ్చి చాలా సంతోషంగా దీపుగాడి గురించి చెప్పబోతుంది. కానీ సౌందర్య పట్టించుకోదు. శుభవార్త అత్తయ్య అంటే..సౌందర్య ఆ గేట్ వైపే చూస్తుంది. శ్రావ్యకు కాల్తది. ఏంటి అత్తయ్య అలా ఉన్నారంటే..పెద్దోడు ఆపరేషన్ అని వెళ్లాడు..ఇంకా రాలేదు గుండె దడగా ఉంది అంటే..శ్రావ్య మనసులో అస్తమానం.పెద్దకొడుకు, కోడలు, వాళ్ల పిల్లలు గురించే తప్ప మా గురించే ఆలోచించే తీరిక మీకు ఎక్కడ ఉంటుంది అత్తయ్య అనుకుంటుంది. సౌందర్య ఏంటో వార్త అన్నావ్ గా చెప్పు అంటే.. వార్త కాదు అత్తయ్య శుభవార్త అని..మీకు మామలు శుభవార్త కూడా మామూలు వార్త లేనే వినిపిస్తుంది అనుకుని..వాళ్ల అమ్మ పుట్టింటి నుంచి 4ఎకరాలు ఆస్తి వచ్చిందని..అది దీపు గాడికి 2 ఎకరాలు, శౌర్య, హిమలకు చేరో ఎకరం రాస్తా అనింది అంటుంది. మనకు ఎందుకు శ్రావ్య ఇవన్నీ అని సౌందర్య అంటే..నేను చెప్పాను అత్తయ్య మా అత్తయ్యాగారికి ఇవన్నీ నచ్చవ్ అని..వాళ్లకే ఇచ్చి..సాగు చేసుకోమన్నాను అంటుంది. కానీ ఇదంతా సౌందర్య వినదు. ఏంటి శ్రావ్య ఏదో అంటున్నావ్ అంటుంది. శ్రావ్య బాధపడి ఏం లేదు అని ఈవిడకు ఎప్పుడు పెద్దకొడుకుద్యాసే అనుకుని వెళ్లిపోతుంది. చూడబోతే..శ్రావ్యను నెగిటివ్ యాంగిల్ లోకి మారుస్తున్నట్లు కనపిస్తుంది.
ఆసుపత్రిలో ఆపరేషన్ రెడీ అవుతుంది. కార్తీక్ కి ఎందుకో కళ్లు తిరుగుతాయి. చేతులు వణుకుతుంది. రివి ఏంటి కార్తీక్..మీ చేతులు వణుకుతున్నాయ్ అంటే..ఏదో లోపల కాస్త టెన్షగా ఉంటుంది కదా..అందుకే అంటాడు కార్తీక్. నిన్ను నేను ఎప్పుడు ఇలాచూడలేదు అంటాడు రివి. కార్తీక్ ఆపరేషన్ స్టాట్ చేస్తాడు. అక్కడున్న వాళ్లు షాక్ గా చూస్తారు. కార్తీక్ మత్తుమత్తుగా తిరుగుతాడు. రవి ఆపేద్దాం కార్తీక్ అంటే కార్తీక్ పర్లేదు రవి చేద్దాం ఓపెన్ చేశాం కదా అంటాడు. అక్కడున్న వాళ్లు ఎంత చెప్పినా వినకుండా కార్తీక్ ఆపరేషన్ చేస్తాడు. పల్స్ రేట్ పడిపోతుంది. బయటున్న పేషెంట్ భార్య పిల్లలు తింటారు. ఆవిడ పిల్లలకు ముద్దలు కలిపిపెడుతుంది. వీళ్ల ఓవర్ యాక్షన్ చూస్తుంటే..కార్తీక్ ఆ పేషంట్ ని చంపేశాలా ఉన్నాడు. ఆపరేషన్ థియటర్లో ఉన్న కార్తీక్ తప్పుతప్పుగా చేస్తాడు. రవి ఎంత చెప్పినా వినడు. ఫైనల్ గా అతను చనిపోతాడు. రవి చేతులు దాటిపోయాయ్ కార్తీక్..చంపేశావ్ అంటాడు. ఏంటో ఈ సీరియల్ లో ట్విస్ట్ ఈరోజు. కార్తీక్ అలా ఎందుకు చేశాడో, తనకు అలా అవడానికి కారణం ఏంటో..రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news