కార్తీకదీపం సెప్టెంబర్ 8 ఎపిసోడ్ 1139: మోనితను చూసేసిన దీప..చేస్ చేసి పట్టుకోగలదా..!

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో దీప కార్తీక్ ఆసపత్రిలో బాధపడుతూ ఉంటారు. మోనితవల్లే చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని కార్తీక్ అంటాడు. ఏడవకు దీప తప్పు చేసిన వాళ్లే ఏడవాలి. మోనిత నాకు గుణపాఠం నేర్పింది అంటూ కార్తీక్ చింతిస్తాడు. దీప భోజనం పెడితే… నాకు బాధతో ఆకలివేయటం లేదు..నువ్వు ఆకలేసిన పట్టించుకోవటం లేదు. అసలు నీకు ఏం ఇచ్చాను నేను ఈ కన్నీళ్లు తప్ప అంటాడు. అసలు మిమల్ని కాపడటానికి మార్గమే లేదా అని దీప అడుగుతుంది. ఒకే ఒక మార్గం ఉంది ..మోనిత బతికే ఉందని కనిపెట్టకలిగితే ఈ శిక్ష నుంచి బయటపడవచ్చు అని కార్తీక్ అంటాడు. ఇంతలో మోనిత వస్తుంది. కానీ కార్తీక్ వాళ్లు చూసుకోకుండా మాట్లాడుకుంటారు. డోర్ దగ్గర ఉన్న మోనిత భయంతో చెప్పేస్తాడా..డా.రీనా వేషంలో వచ్చింది నేనే అంటాడా అనుకుంటుంది. ఇంతలో పోలీస్ వచ్చి సర్ డాక్టర్ రీనా ఫోన్ అని ఇస్తాడు.

karthika-deepam
karthika-deepam

దీప నువ్వెళ్లి ప్లేట్స్ క్లీన్ చేసుకొనిరా అని దీపను పంపిస్తాడు కార్తీక్. ఫోన్ తీసుకుని మాట్లాడతాడు. ఏంటి గొంతు పుడుకుపోయింది..ఇప్పటివరకూ బానే మాట్లాడావ్ కదా అంటుంది మోనిత. బయటకొద్దామంటే పోలీసులు ఉండటంతో మళ్లీగదిలోకే వెళ్తాడు కార్తీక్. మోనిత ఫోన్ లో  తాళి కట్టటానికి ఇంక అరగంటే టైం ఉంది , మీ ఆవిడతో మొత్తం చెప్పెస్తే ఊరుకుంటుందా..మన పెళ్లిజరగకపోతే నేను మీ వాళ్లను బతకనివ్వను కదా అంటూ బెదిరిస్తుంది. కోపంతో కార్తీక్ తాళికట్టినంతమాత్రనా నేను నీతో కాపురుచేస్తా అని ఎలా అనుకున్నావే. అసలు నేను నిన్ను మనిషిలా కూడా చూడను అంటాడు. మోనిత ఇప్పుడు ఇదంతా వద్దు కార్తీక్… నీకు నీ ప్రాణంకంటే కుటుంబం అంటేనే ఎక్కువ ఇష్టం అనినాకు తెలుసు.. నువ్వు తాళికట్టకపోతే నా రాత ఇంతే అని నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది. ఇంతలో ప్లేట్స్ తీసుకోని వెళ్తూ ఉన్న దీప మోనితను చూస్తుంది.

స్లోగా మోనిత దగ్గరకు నడుచుకుంటూ వెళ్తుంది. దీపను పంపించే నా మెడలో తాళికట్టేసే..నా గురించి నీకు బాగా తెలుసు అంటూ మాట్లాడుతుంది మోనిత. వెనకే ఉన్న దీప  ప్లేట్స్ నేలకేసి మోనితను పట్టుకుంటుంది. కోపంతో ఎన్నిరోజులని తప్పించుకుంటావే డాక్టర్ బాబుని కాపడటానికే ఆ దేవుడు ఈ టైంలో నిన్ను కనిపింటేలా చేశాడు అని  అంటుంది. మోనిత ఏమన్నా ఊరుకుంటుందా..దీపను కిందపడేసి కారు ఎక్కేసి వెళ్తుంది. దీప వారణాసిని పిలిపించి కారును ఫాలో అవుతుంది.

ఇంకోపక్క కార్తీక్ ..అసలేంటి మోనితకు ఇంత నమ్మకం. దీపకు అన్యాయం చేయాలని నేను ఎలా అనుకుంటా అంటాడు. ఇటుసైడ్ దీప మోనితకారును ఫాలో అవుతుంది. కోర్టుకు ఆనంద్ రావు, సౌందర్య వస్తారు. వచ్చేటప్పుడు ఇలా వచ్చాం, వెళ్లేప్పుడు ఎలా వెళ్తామే తెలియటం లేదు సౌందర్య అంటాడు ఆనంద్ రావు. ఇది కోర్టు అండి న్యాయం జరుగుతుంది అంటూ కొంచెం ధైర్యం నింపుతుంది. ఒకరిని ఒకరు ఓదార్చుకుంటారు. ఇంతలో ఆదిత్య కూడా కోర్టుకు వస్తాడు. ఇక్కడ కుర్చున్నారేంటి మమ్మీ టైం అయ్యేవరకు కారులో కుర్చోపోయారా అంటాడు. ఎక్కడైన ఒకటేలేరా అని సౌందర్య అంటుంది. ఆనంద్ రావు నాకు భయంగా ఉందిరా అంటూ ఏడుస్తాడు. కార్తీక్ దీనస్థితిని తలుచుకుని అందరూ చింతిస్తారు.

ఇంకా మోనితను దీప ఫాలో అవుతునే ఉంటుంది. మోనిత డ్రైవర్ ఎక్కడికి పోవాలి అంటే ఎక్కడోదగ్గరకు పోని అంటుంది. అంటే మా క్యాబ్ బుక్ చేసుకుంది మీరు కాదా అంటే కాదు అంటుంది. అయితే నామీద వాళ్లు కంప్లెంట్ చేస్తారు అంటాడు డ్రైవర్.. మోనిత డ్రైవర్ కు బాగా డబ్బులు ఇస్తుంది. డ్రైవర్ ఎందుకు ఇంత టెన్షన్ అంటే…వెనకే ఓ కారు ఫాలో అవుతుంది అందులో వాళ్లు నన్ను చంపాలని తరుముతున్నారు. అని సీన్ రివర్స్లో చెప్తుంది.

ఇటుపక్క ఆసుపత్రిలో ఉన్న కార్తీక్ కు సీన్ అర్థమవుతుంది. మోనితను దీప చూసే  తరుముకుంటూ వెళ్లి ఉంటుందని అర్థమవుతుంది. గదిలోంచి బయటకొచ్చి నర్స్ ని అడిగుతాడు..వాళ్లు తెలియదంటారు. పోలీసులను దీప కనిపించిందా అని అడుగుతాడు.వాళ్లు తెలియదంటారు. రీనా గురించి అడిగితే ఆమె ఎక్కుడో ఉండి ఫోన్ చేసింది కదా అంటారు. కార్తీక్ టెన్షన్ తో ప్లేట్స్ కడగటానికి బయటకువచ్చింది ఇంతవరకు రాలేదు ఎక్కడుందో నేను చూసివస్తాను అని కార్తీక్ వెళ్లబోతాడు. పోలీసులు ఆగండి అని ఆపుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.