ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంక్ ఖాతాలకు లింకు అయ్యిందో ఇలా చూడచ్చు..!

-

మనకి వుండే కీలకమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికీ ఉపయోగ పడుతుంది. ప్రభత్వ స్కీమ్స్ యొక్క లాభాలని పొందడం మొదలు ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది. అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి కూడా ఆధార్ అవసరం. ఖాతాదారులు తప్పని సరిగా తమ ఖాతాలకు ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కొన్ని రోజుల క్రితమే ఓ కీలక ప్రకటన చేసింది.

JOBS IN AADHAR CENTER

ఇది ఇలా ఉంటే కరోనా మహమ్మరి సమయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక కొత్త సేవలను ప్రజల కోసం తీసుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మరి కొన్ని సేవలని తీసుకు వచ్చింది. ఈ కొత్త సర్విస్ ద్వారా పౌరులు తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో ఆన్లైన్ ద్వారా తెలుసుకునేందుకు అవుతుంది.

ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అయిందో కూడా తెలుసుకోవచ్చు. అయితే అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. దీనితో మీరు ఈజీగా తమ ఆధార్ నెంబర్ ఎన్ని బ్యాంకు ఖాతాలకు లింక్ చేశారో చూడచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్ లో ప్రత్యేకంగా ఓ లింక్ అందుబాటులో ఉంచింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈజీగా తెలుసుకోవడానికి అవుతుంది.

దీని కోసం ముందుగా యూఐడిఏఐ https://uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
ఇక్కడ హోమ్ పేజీలో ‘ఆధార్ సర్వీసెస్’ పైన మీరు క్లిక్ చేయాలి.
“చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్” పైన ఇప్పుడు మీరు క్లిక్ చెయ్యండి.
ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు “సెండ్ ఓటీపీ” పైన క్లిక్ చేయాలి.
మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చెయ్యండి.
మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ వివరాలు మీరిక్కడ చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news