స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? అయితే ఇలాంటి వాటితో జాగ్రత్త..!

-

కరోనా మహమ్మారి సమయంలో మోసాలు మరెంత ఎక్కువైపోయాయి. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్స్ యొక్క వినియోగం కూడా బాగా పెరిగిపోవడంతో సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశంగా మారిపోయింది. దీనితో మోసాలు ఎక్కువైపోయాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మోసగాళ్ల చేతిలో మోసపోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఈ మధ్య స్కీమ్స్ లో డబ్బులని ఇన్వెస్ట్ చేస్తున్నారు దానిని ఆసరాగా తీసుకుని మోసగాళ్లు ఫేక్ స్కీమ్స్‌తో ప్రజలను ఆకర్షించడానికి చూస్తున్నారు.

వీటిని పోంజి స్కీమ్స్ అని కూడా పిలుస్తారు. మోసగాళ్లు మీరు ఇలాంటి పథకాల్లో చేరితే అధిక రాబడి వస్తుందని చెప్పి నమ్మిస్తున్నారు. పైగా ఎక్కువ లాభం ఇలా ఇన్వెస్ట్ చేస్తే వస్తుందని అంటున్నారు. అలా కనుక నమ్మరంటే డబ్బులనీ పోతాయి. అందుకే ప్రజలు పోంజి స్కీమ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి.

డబ్బులు పెట్టడానికి ముందే లిఖిత పూర్వకంగా ఇన్వెస్ట్‌మెంట్ సంబంధిత సమాచారం మొత్తం తెలుసుకోండి. అలానే ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోటర్‌ను అడగడం, బ్యాక్‌గ్రౌండ్ చేయండి, సర్వీసులు అందించడానికి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోండి లాంటివి చెయ్యాలి.

మీరు కనుక ఇన్వెస్ట్ చేసేసి, రాబడి పొంది ఉంటే మరోసారి ఇన్వెస్ట్ చెయ్యాలని ఒత్తిడి చేస్తుంటే మీరు అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయండి. అదే విధంగా ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తెలియక ఇలాంటి వాటి వలన మోసపోతున్నారు. కనుక జాగ్రత్త పడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news