ఈ స్కీమ్ లో రూ.3వేలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.44 లక్షలు మీ సొంతం.. వివరాలివే..

-

ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల జీవితాలు జీవన వ్యయం అస్తవ్యస్తంగా మారింది. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నందున ఇంటి బడ్జెట్‌ను నియంత్రించడం తలకిమించిన భారమవుతోంది..ఇలాంటి పరిస్థితులు మనుషులను ఆలోచనలో పడేస్తుంది.అందుకే ముందుగానే సేవింగ్స్ కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ చేసుకోవడం మంచిది..

ద్రవ్యోల్బణాన్ని అధిగమించి కొన్ని సంవత్సరాలలో మిమ్మల్ని మిలియనీర్‌గా మార్చే ఒక ప్రభుత్వ స్కీం ఉంది. దానిపేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్.. రిటైర్మెంట్‌ తర్వాత పౌరులకు ఆర్థిక భద్రతను అందించడానికి ప్రభుత్వం రూపొందించిన పథకమే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది మొదట్లో ప్రభుత్వ రిటైర్మెంట్‌ పథకం కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి అందుబాటులోకి వచ్చింది. పెన్షన్ ఫండ్‌లో జమ చేసిన డబ్బును 60 ఏళ్లు పైబడిన ఎవరైనా ఉపయోగించుకోవచ్చు..

ఇందులో పెట్టుబడి పెట్టడానికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. కనీసం రూ.500 ప్రారంభ పెట్టుబడి ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఎన్పీఎస్‌లో రెండు రకాల ఖాతాలుంటాయి ఒకటి టైర్ 1 మరొకటి టైర్ 2 ఈ రెండింటిలో ఎందులోనైనా పెట్టుబడి పెట్టవచ్చు. NPS పొదుపును నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెన్షన్ ఫండ్ నిర్వాహకులు స్టాక్‌లు, వ్యాపారాల నుంచి బాండ్‌లు, ప్రభుత్వ ఆస్తులలో పెట్టుబడి పెడతారు.. పదవి విరమణ పొందటానికి ఇది బెస్ట్ స్కీమ్ అనే చెప్పాలి..

ఉదాహరణకు మీకు 34 ఏళ్లు అయితే మీరు ఈ పథకంలో నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 26 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.9.36 లక్షలు అవుతుంది. ఎన్ పి34 ఏళ్లు అయితే మీరు ఈ పథకంలో నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 26 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.9.36 లక్షలు అవుతుంది. దీన్ని లెక్కించిన తర్వాత మీరు మెచ్యూరిటీపై రూ.44.35 లక్షలు పొందుతారు. ఇంత మొత్తం దాదాపు ఏ పథకంలో పొందలేరు. లెక్కించిన తర్వాత మీరు మెచ్యూరిటీపై రూ.44.35 లక్షలు పొందుతారు. ఇంత మొత్తం దాదాపు ఏ పథకంలో పొందలేరు.. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే ఇలా పొదుపు చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news