శాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ అంటే ఏమిటి?ప్రయోజనాలు?

-

ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు కుటుంబ పోషణ కోసం ఏదొక పని లేదా ఏదొక ఉద్యోగం చేస్తారు..ఆ వచ్చిన డబ్బులను మొత్తాన్ని తన కుటుంబం కోసం ఖర్చు చేస్తాడు..ఏ కాలం ఎలా ఉంటుందో అని తాము చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకు ఆసరాగా ఉండేలా కొన్ని పొదుపు పథకాలలో డబ్బులు పెడతారు.అలాంటి వాటిలో ఒకటి సాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్.. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకుంటే మీరు మరణించిన తర్వాత కూడా నెల వారీగా జీతం వచ్చే మొత్తం కుటుంబానికి చేరుతుంది.

ఈ సాలరీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌నే ఇన్‌కమ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ అని కూడా అంటారు. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా ఉద్యోగులు మరణించినా కుటుంబం జరుగుబాటు కోసం ఎంచుకున్న సంవత్సరాలకు నెలవారీగా జీతం స్థాయిలో డబ్బులు వస్తాయి.

ఈ ఇన్స్యూరెన్స్ ప్లాను తీసుకోవాలనుకొనేవారు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.ఇది కేవలం టర్మ్ పాలసీ. మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. మీరు ఒక వేళ 15 సంవత్సరాల కాలంగా టర్మ్ పాలసీ ఎంచుకుంటే.. ఇన్సూరెన్స్‌ను ఎంచుకున్న తర్వాత మరణిస్తే.. మిగిలినా ఆ సంవత్సరాలు ప్రతి నెలా కుటుంబానికి డబ్బులు అందుతాయి. అయితే.. ఒక వేళ టర్మ్ కాలం అంతా జీవించి ఉంటే.. మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు.

ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కుటుంబానికి ఎలా అందాలనేదాన్ని కూడా పాలసీ హోల్డర్ నిర్ణయించవచ్చు. అంటే.. తాను మరణించగానే.. మొత్తం డబ్బులు వచ్చేలా లేదా.. నెలవారీగా వచ్చేలా నిర్ణయించి పెట్టవచ్చు. అలాగే.. నెలవారీగా ఎంత మొత్తంలో డబ్బులు కుటుంబానికి చేరాలనేది కూడా నిర్ణయించుకోవచ్చు.. అంటే ఇప్పుడు అతను జీతానికి సమానంగానా లేక అంతకన్నా తక్కువ అనేది కూడా తాను ఫిక్స్ చేసి పెట్టవచ్చు..ఈ పాలసీకి ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తుంది… ఎక్కువ మంది పాలసీ లో చేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news