జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లొకి రానున్న సంగతి తెలిసిందే..కాగా, ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది…ఇందుకు సంభందించి వచ్చే నెల 4 వరకూ డెడ్ లైన్ ను ఇచ్చింది..ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ జూన్ 27న నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్రం పంపిన నోటీసులను ట్విట్టర్ పట్టించుకోలేదు.
అయితే, 80కి పైగా ట్విటర్ అకౌంట్లను బ్లాక్ చేశామని ట్విట్టర్ తేల్చిచెప్పింది. ఆయా అకౌంట్లకు సంబంధించిన జాబితాను జూన్ 26న కేంద్రానికి సమర్పించింది. ట్విటర్ పాటించాల్సిన ఆర్డర్‌లు ఇంకా ఉన్నాయని తెలిపింది. జూలై 4 మాత్రమే చివరి గడువని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి..కానీ, ట్విట్టర్ మాత్రం పట్టించుకోలేదు..