చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ను భారత్ లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. భారత్ బాటలోనే నడిచిన అమెరికా సహా మరికొన్ని దేశాలు కూడా ఈ యాప్ ను బ్యాన్ చేశాయి. అయితే ఇలా వరుస షాక్ లు తింటున్న టిక్‌టాక్.. తాజాగా.. మైక్రోసాఫ్ట్ కే షాక్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ అఫర్‌ను టిక్‌టాక్ తిరస్కరించింది. అమెరికాలో టిక్‌టాక్ ఆపరేషన్స్ బైట్ డ్యాన్స్ అమ్మడం లేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అమెరికాలో టిక్‌టాక్ పై ట్రంప్ నిషేధం విధించారు.
టిక్‌టాక్ ఆధారంగా అమెరికా ప్రజలపై చైనా నిఘా పెడుతుందని ట్రంప్ ఆరోపనలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో టిక్‌టాక్‌ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ పోటీపడ్డ విషయం తెలిసిందే. అలాగే భారత్ చైనా యాప్‌లను నిషేధించడాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతించిన విషయం తెలిసిందే.