మాగ్జిమం ట్రై చేస్తున్న ఏపీ బీజేపీ… ఇది ఏపీ!!

-

దేశరాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయా అనేది తెలుగువారికి బాగా తెలిసిన విషయం! కులంతోనో, మతంతోనో ఏపీలో రాజకీయాలు చేసేద్దాం.. అధికారం చేపట్టేద్దాం.. కుర్చీలెక్కేద్దాం అంటే అది జరిగేపనికాదనేది జగమెరిగిన సత్యం! అయినా కూడా సందర్భం మరిచి కేవలం కామెంట్ లో పేర్లు ఉన్నాయన్న కారణంగా కొడాలి నానిపై కత్తి కట్టిన ఏపీ బీజేపీ నేతలు.. హస్తినలో మార్కులకోసం ఏపీలో కలెక్టరేట్ లను ముట్టడించారు!

అవును… మోడీ, యోగి ఆదిత్యానాథ్ లు పక్కన భార్యలు లేకుండానే శంకుస్థాపనలు గట్రా చేస్తున్నప్పుడు జగన్ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై.. తమకు అర్ధమైనట్లు అర్ధం చేసుకున్న ఏపీ బీజేపీ నేతలు.. కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపునిచ్చారు. కరోనా గుర్తురాలేదో ఏమో కానీ.. గుంపులు గుంపులుగా బయలుదేరారు! ఈ ఒక్క కారణాన్ని పట్టుకుని ఏపీలో జెండా పాతేయాలనేది వారి బలమైన కోరిక అని ప్ర్జలు గ్రహించినా కూడా.. ఆ విషయం వారికి అర్ధం కాకపోవడం కొసమెరుపు!

కాంగ్రెస్ పార్టీ ఒక వైభవంతో ఊగిపోతున్న దశలో తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ నందమూరి తారకరామారావు.. తెలుగువాడి సత్తా ఏమిటో చూపించారు! అంతా అమ్మ అంటూ సోనియా గాంధీ దగ్గర “యెస్ బాస్” అంటున్న దశలో విధేయతకీ భానిసత్వానికి గల తేడా తందైన శైలిలో చూపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి! ఇప్పుడు జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఈ విషయాలు గ్రహించిన బీజేపీ నేతలు.. మిగిలిన విషయాలు అన్నీ మరిచి ఇలా ఏమైనా ప్రయోజనం కలుగుతుందేమో అని కలెక్టరేట్ ల ముట్టడి చేపట్టారని అంటున్నారు విశ్లేషకులు!

ఏపీలో ఇలా కులాల మీదో, మతాల మీదో రాజకీయ పునాదులు వేసుకుందాం.. రాజకీయంగా పబ్బం గడుపుకుందాం అని కలలు కనేవారికి ఆ అవకాశాలు ఎక్కడైనా సాగుతాయేమో కానీ.. ఏపీలో కాదన్న విషయం ఇంకెప్పుడు అవగతమవుతుందో అని అంటున్నారు నెటిజన్లు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news