పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా బరిలో మాజీ మంత్రి…!

-

తెలంగాణలో త్వరలో జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీలు వ్యూహ రచన మొదలుపెట్టాయి. అభ్యర్థుల ఖరారుపై వడపోతలు, కసరత్తులు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. ఎంతోమంది పార్టీ పాత నేతలు టికెట్‌ ఆశిస్తుంటే..కమలం పార్టీలో అనూహ్యంగా కొత్త పేరు చర్చలోకి వచ్చింది.

ఖమ్మం-నల్లగొండ- వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి పేరు తెరపైకి రావడం కమలనాథులను ఆశ్చర్యంలో పడేసింది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కరుడుగట్టిన బీజేపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు కాసం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు టికెట్‌ ఆశించిన వారిలో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ మధ్యనే బీజేపీ లో చేరిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ని నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుండి బరిలోకి దించాలని బీజేపీ దాదాపు గా డిసైడ్ అయిన్నట్టు తెలుస్తోంది..

పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఖమ్మం లో బీజేపీ కి అంత పట్టు లేదు… పెద్దిరెడ్డి అయితే ఆ జిల్లాలో ఉన్న టీడీపీ క్యాడర్ ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది… టీడీపీ నేతగా మంత్రిగా, కార్మిక సంఘం నేతగా ఆయన చాలామందికి తెలిసిన వ్యక్తి.. ఇటు బీజేపీ క్యాడర్ తో పాటు ఆయన సొంత పరిచయాలు కలిసి వస్తాయని…టీడీపీ తో కలిసి పనిచేసిన ఒక సామాజిక వర్గం కూడా పెద్దిరెడ్డి ని నిలబెడితే ఆయనకు ఓట్లు వేస్తారని పార్టీ బావిస్తుంది..ఒకటి రెండు రోజుల్లో పెద్దిరెడ్డి ని తమ అభ్యర్థిగా బీజేపీ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news