హృదయ ఆరోగ్యం కోసం వీటిని తీసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని చాలా మంది గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. గుండె ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారం, జీవన విధానం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈరోజు నిపుణులు గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి చెప్పారు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దాని గురించి చూద్దాం.

heart
heart

నట్స్

మనకు ఎన్నో రకాల నట్స్ అందుబాటులో ఉంటాయి. వేరుశెనగ పలుకులు, జీడిపప్పు మొదలైనవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తప్పకుండా మీరు ప్రతిరోజు డైట్ లో తీసుకోండి. వేరుశెనగ పలుకులు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది అలానే జీడిపప్పు లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది .ఇది మంచి నిద్రను ఇచ్చి రిలాక్స్ గా ఉంచుతుంది. బీపీ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అలానే కొబ్బరి కూడా గుండె ఆరోగ్యానికి మంచిది హైబీపీ ని ఇది కంట్రోల్ చేస్తుంది.

నెయ్యి

నెయ్యి పంచామృతాలలో ఒకటి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. స్వచ్ఛమైన నెయ్యిని ప్రతిరోజు మీరు తీసుకుంటే చక్కని ఫలితం పొందవచ్చు. కాన్స్టిపేషన్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఉండవు.

పండ్లు

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. అరటి పండ్లు మొదలు అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలానే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ఏది ఏమైనా ఉప్పు వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అందుకని వంటల్లో మీరు తగ్గిస్తే మంచిది. సగం శాతం ఉప్పుని తగ్గించడం వల్ల సగం ముప్పు తగ్గిపోతుంది అని గమనించి ఉప్పు కి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదు కాబట్టి ఈ చిట్కాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news