హుజూరాబాద్ స్పెషల్: కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నారా?

-

ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికారపార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కొత్త హామీ ఇచ్చినా.. అందుకు కారణం కచ్చితంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది స్పష్టమైన విషయం! ఈ విషయంలో కేసీఆర్ మరోసారి తెలంగాణ ప్రజలను, మరి ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేయబోతున్నారని తెలుస్తోంది.

kcr
kcr

ఎన్నికలు వచ్చాయంటే… ప్రజలకు ఆశ చూపించి, ఓట్లు రాబట్టుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీలైతే హామీల వర్షం కురిపించి అవసరం తీరాక అన్నీ మర్చిపోతాయి. మళ్లీ ఎన్నికలు అనగానే పార్టీకి ఆ హామీలు గుర్తుకువస్తాయి. సరిగ్గా… తెలంగాణలో ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. ప్రతీ ఉప ఎన్నిక సమయంలోనూ కేసీఆర్ మాటలు – ఎన్నికలయ్యాక వారి చేతలు అచ్చు ఇలానే ఉంటున్నాయని అంటున్నారు!

అవును… దుబ్బాక ఉప ఎన్నిక మొదలు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకూ నిరుద్యోగల కోసం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అంటూ టీఆర్ఎస్ చేసీన్ మోసమే చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే! అయితే ఈ విషయాన్ని గ్రహించారో ఏమో కానీ… దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీకి షాకిచ్చారు తెలంగాణ ప్రజలు!

అయితే… నాగార్జన సాగర్ ఉప ఎన్నికలో అధికారపార్టీకి విజయం దక్కడంతో ఇక ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తున్నామనే హడావుడి చేసింది. ఏయే శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో జాబితా సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం.. ఆయా శాఖల్లోని అధికారులు ఆఘమేఘాల మీద 60 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు లెక్కతేల్చడం జరిగింది. దీంతో ఇక నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు ఆశపడ్డారు. కానీ… మళ్లీ వారి ఆశ.. నిరాశే అయ్యింది!

తాజాగా మరోసారి ఉప ఎన్నిక రావడంతో… మరోసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఎలాగైనా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న అధికారపక్షం “దళిత బంధు” పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అయితే అదొక్కటే సరిపోదని బలంగా నమ్ముతున్న అధికారపార్టీ… మరోసారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మళ్లీ ఆశలు పెట్టబోతుందంట! దీంతో… కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు!

కాగా… రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో జోనళ్ల వారీగా కూడా నియమాకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిన సంగతి తెలిసిందే!

Read more RELATED
Recommended to you

Latest news