ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ కోసం సింగరేణిని తాకట్టు పెట్టారు- కేసీఆర్ పై వైఎస్ షర్మిళ ఫైర్

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైరయ్యారు. ఇటీవల ప్రతీరోజు తెలంగాణలో ఏదో ఒక సమస్యపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రైతు సమస్యలు, ధాన్యంకొనుగోలు, నిరుద్యోగం, యువత ఆత్మహత్యలపై స్పందిస్తున్నారు. తాజాగా సింగరేణి కార్మికుల సమస్యలు, బొగ్గు బ్లాకులు వేలంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
 

ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిళ స్పందించారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కార్పొరేట్ శ‌క్తుల‌కు ధారాద‌త్తం చేసే MMDR చ‌ట్టాన్ని కేంద్రం తీసుకొస్తే, KCR ప్ర‌భుత్వం దానిని వ్య‌తిరేకించ‌లేదని విమర్శించారు. ఢిల్లీలో దోస్తీ.. గ‌ల్లీలో కుస్తీ కోసం తెలంగాణ బొగ్గు గ‌నుల‌ను తాకట్టు పెట్టారని ఆరోపించారు. సింగ‌రేణి స‌మ్మెకు వైఎస్సార్టీపీ మ‌ద్ద‌తు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రానికి లేఖ రాశాన‌ని చెబుతున్న కేసీఆర్…ఆ లేఖ‌ను బ‌హిర్గతం చేయాలని వైఎస్ షర్మళ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్త‌శుద్ధే ఉంటే ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని… పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్‌లో పోరాడాలని సూచించారు. లేదంటే రాజీనామా చేసి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ షర్మిళ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news