1500 మందితో ఢిల్లీలో 11వ తేదీన టీఆర్‌ఎస్‌ ధర్నా

-

1500 మందితో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ నాయకులంతా ధర్నా చేస్తారని ఎంపీ రంజిత్‌ రెడ్డి ప్రకటన చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం టీఆరెస్ తలపెట్టిన ఢిల్లీలో ధర్నాకు జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ రంజిత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి.. మాట్లాడుతూ.. కేంద్రంతో ఢిల్లీ వేదికగా తాడో పేడో తేల్చుకుంటామని.. 11 వ తేదీన తెలంగాణ క్యాబినెట్, ప్రజా ప్రతినిధులందరూ ధర్నాలో పాల్గొంటారన్నారు.

ధాన్యం కొనుగోళ్లపై ఏడాది నుంచి కేంద్రాన్ని నిలదిస్తున్నామని.. మమ్మల్ని నూకలు తినమని పియూష్ గోయల్ అన్నారని ఫైర్‌ అయ్యారు. సభను కేంద్ర మంత్రి తప్పుదోవ పట్టించారని.. పంజాబ్ వెల్లి నూకలు తినండి అని చెప్పండి..ఉరికించి కొడతారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. బిజెపి ప్రతిదీ రాజకీయం చేస్తోందని.. మేం కొనేది లేదు.. కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రం ముక్కు పిండి వడ్లు కొనిపించండని ఎంపీ రంజిత్‌ రెడ్డి హెచ్చరించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news