Exclusive : రాజకీయాలకు సినిమా’రంగు’.. ఆట ముగిసింది..!

-

ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ.. తెలంగాణాలో పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి వల్ల గత నెలరోజులుగా ఎక్కడ చూసినా ఒకటే హంగామా. తెలంగాణాలో రిజల్ట్ లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు కాని ఏపిలో మాత్రం అటు టిడిపి, ఇటు వైసిపి రెండు పార్టీలు గట్టిగా ప్రచారం చేశాయి. ఇక ఈసారి ఎన్నికల్లో రాజకీయాలకు సినిమా వాళ్ల హంగామా కూడా బాగానే ఉంది.

కొందరు అధికార పార్టీకి సపోర్ట్ గా నిలిస్తే.. మరికొందరు ప్రతిపక్ష పార్టీకి అండగా ఉన్నారు. మధ్యలో మూడవ పార్టీ జనసేనకు కొంతమంది బాసటగా నిలబట్టారు. అయితే ఈసారి ఎలక్షన్స్ లో స్టార్ కలరింగ్ ఏది లేదని చెప్పాలి. 2009లో ఎన్.టి.ఆర్, 2014 లో మహేష్ ఇలా స్టార్స్ వారి ఫ్యాన్స్ కు అప్పట్లో సందేశాలు పంపించారు. ఇక ఈసారి స్టార్స్ పెద్దగా పొలిటికల్ కాంపెయిన్ లో పాల్గొనలేదు.

జనసేన తరపున అల్లు అర్జున్, తండ్రి నాగబాబు కోసం వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి సినిమా గ్లామర్ ఎక్కువ వాడిన పార్టీ వైసిపి. ఏపి బాగుపడాలంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలు తీరాలంటే జగన్ సిఎం కావాలంటూ మోహన్ బాబు, పోసాని, థర్టీ ఇయర్స్ పృధ్వి, ఆలి వంటి వారు వైసిపికి సపోర్ట్ గా జగన్ తో చేతులు కలిపారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబు శ్రీవిద్యా నికేతన్ కు రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ గురించి చంద్రబాబుకి వ్యతిరేకంగా ధర్నా చేసి ఆ తర్వాత వైసిపి కండవా కప్పుకున్నారు. ఇక మరో పక్క ఆలి కూడా ముందు టిడిపిలో చేరుతారని అనుకోగా ఫైనల్ గా వైసిపిలో జాయిన్ అయ్యారు. అయితే తాను ఏ పార్టీలో చేరినా రాజమండ్రి సీటు ఇస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పిన ఆలి వైసిపిలో కనీసం టికెట్ ఇవ్వకపోయినా సైలెంట్ గా ఉన్నారు.

థర్టీ ఇయర్ పృధ్వి, పోసాని వైసిపి తరపున బాగానే ప్రచారం చేశారు. ప్రెస్ మీట్ లలో పోసాని చంద్రబాబుని టార్గెట్ చేస్తే.. పృధ్వి మాత్రం డైరెక్ట్ గా ప్రచారంలో కూడా మిగతా రెండు పార్టీలను టార్గెట్ చేశాడు. ఇక జనసేన తరపున ఎంపిగా పోటీ చేసిన నాగబాబుకి వ్యతిరేకంగా మా ఎలక్షన్స్ లో తనకి సపోర్ట్ ఇవ్వలేదని శివాజి రాజా వైసిపిలో చేరి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అది ఎంతవరకు ప్రభావం చూపిందో తెలియదు.

ఇక రోజాకి పోటీగా దివ్య వాణిని రంగంలోకి దించగా ఆమె కూడా హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. ఇక ఈ ఈ ఎన్నికల టైంలో ముందునుండి తటస్థంగా ఉంటూ వచ్చి చివరగా ఓ పార్టీకి సపోర్ట్ గా ఇస్తూ జరిగేది ఇదే అంటూ సంచలనం సృష్టించాడు శివాజి. ఇన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ ఆయన ఈ ఎలక్షన్ టైం బాగా క్యాష్ చేసుకున్నాడు.

ఇక తమ్ముడు పార్టీ పెడితే అన్నయ్య సపోర్ట్ ఉంటుందా ఉండగా అంటూ మొదటి నుండి వెంటాడుతున్న ప్రశ్నే. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని కలిపేసిన చిరంజీవి ఆ తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. పదవీ కాలం ముగియడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ ఎన్నికల టైంలో సైరా షూటింగ్ లో తప్ప ఏ పార్టీ తరపున కనీసం పరోక్షంగా కూడా ప్రస్థావించలేదు చిరంజీవి.

జనసేన తరపున అల్లు అర్జున్ ప్రచారంలో చివరి రోజు మీటింగ్ లో పాల్గొనగా.. రాం చరణ్ మాత్రం తన సపోర్ట్ కే బాబాయ్ అంటూ పవన్ సిక్ అయినప్పుడు మాత్రమే వచ్చి కలిశాడు. మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్న జయసుధ చివరి నిమిషంలో వైసిపిలో చేరి రాజకీయ పరమైన విమర్శలు చేసింది.

ఇదవరకు కన్నా ఈ ఎలక్షన్స్ లో టాలీవుడ్ పరిశ్రమలో కూడా కొన్ని చీలికలు ఏర్పడ్డాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు టిడిపికి మరికొందరు వైసిపికి.. మిగతా వాళ్లు కొందరు జనసేనకు ఇలా తెలుగు సిని పరిశ్రమ మొత్తం మూడు పార్టీలకు సపోర్ట్ అందించారు. మరి విజేత ఎవరో కాని రాజకీయం ముగిసింది కాబట్టి ఇవన్ని పక్కన పెట్టి వారంత మళ్లీ సినిమాలు చేసుకుంటూ బిజీ అవ్వాలని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

Read more RELATED
Recommended to you

Latest news