‘సామాజిక’ బస్సు తుస్..జగన్ దిగాల్సిందేనా?

-

గత ఎన్నికల్లో అన్నీ వర్గాల వారు జగన్ కు మద్ధతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ వర్గం, ఈ వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జగన్ వైపు నిలబడి వైసీపీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో అన్నీ వర్గాల వారికి న్యాయం చేసే దిశగానే జగన్ ముందుకెళుతున్నారు. ఈ మూడేళ్లలో పథకాల రూపంలో అన్నీ వర్గాల వారికి డబ్బులు ఇచ్చారు. ఇలా అందరికీ న్యాయం చేశామనే ఉద్దేశంతోనే..ఇప్పుడు వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట బస్సు యాత్ర చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మంత్రులు…అందరూ కలిసి ప్రజల్లోకి వెళుతున్నారు…జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులని చెబుతున్నారు…ఆయా వర్గాల వారికి న్యాయం ఎలా చేశామనేది చెబుతూ వస్తున్నారు. ఇక అన్నీ వర్గాల వారికి అద్భుతంగా న్యాయం చేస్తే…వైసీపీ మంత్రుల బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన రావాలి..మరి ప్రస్తుతం బస్సు యాత్రకు స్పందన బాగుండా అంటే..వైసీపీ అనుకూల మీడియాలో బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండగా, టీడీపీ అనుకూల మీడియాలో బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందని వస్తుంది.

మరి ఈ మీడియాల్లో దేన్ని నమ్మాలో ప్రజలకే క్లారిటీ లేదు. అయితే ఇక్కడ పార్టీల అనుకూల మీడియాలని పక్కనబెడితే..అసలు నిజంగానే బస్సు యాత్రకు ఆదరణ ఉందా? అంటే కొన్ని చోట్ల ఉన్నట్లే కనిపిస్తోంది గాని..కొన్ని చోట్ల పెద్దగా స్పందన రావడం లేదు. ఏదో అధికారం ఉండటంతో జనాలని సభలకు తరలించుకుంటున్నారు తప్ప..స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్తితి మాత్రం కనిపించడం లేదని చెప్పొచ్చు…అంటే బస్సు యాత్ర కాస్త తుస్ అవుతుందనే చెప్పొచ్చు.

ఇలాంటి పరిస్తితుల్లో మంత్రులు కాకుండా డైరక్ట్ జగన్ రంగంలోకి దిగితే బెటర్ అని చెప్పొచ్చు..మళ్ళీ వైసీపీ బలం తెలియాలంటే జగన్ జనాల్లోకి వస్తే బాగుంటుంది..జగన్ వస్తే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు..అప్పుడు వైసీపీకి ఇంకా ఊపు వస్తుంది..అలా కాకుండా ఇలా నేతల చేత యాత్రలు చేయిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news