నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ..ఇంత బరితెగింపు పనికి రాదని ఆయన మండిపడ్డారు. మోడీ..అమిత్ షా లది నేరగాళ్ల మనస్తత్వమని, రాక్షస ఆనందంకి రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అర్థరాత్రి వరకు ఆఫీస్ లో నిర్బంధించి విచారణ చేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. ఉదయం 10 నుండి 6 గంటల వరకే కదా విచారణ చేయాల్సిందని రేవంత్ వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని, బదిలీ అవుతుంది.. ఆప్పుడు వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. అధికారులు కూడా జాగ్రతగా ఉండండని, పదవులు ఇచ్చారని… రాజకీయ బాసుల మాటలకు తలొగ్గి పని చేయకండని ఆయన హితవు పలికారు.
రెండు సార్లు ఓడితే..నాలుగు సార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్ అని, 300 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనతా పార్టీ కూడా ఇట్లనే.. ఇందిరా గాంధీని చేసిందని, 1980లో రెట్టింపు మెజారిటీ తో అధికారంలోకి వచ్చిందన్నారు. 2024లో మళ్లీ పునరవృతం కానుందని, సోనియా గాంధీని అవమానించాలనీ మోడీ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ..ఈడీ ఆఫీస్ లో కాలు పెట్టిన రోజే బీజేపీ సర్వ నాశనం అవుతుందని ఆయన ధ్వజమెత్తారు. వినాశ కాలే విపరీత బుద్ది అని ఆయన వ్యాఖ్యానించారు. అమిత్ షా..మోడీ లకు పోయే కాలం దగ్గర పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.