మిల్లర్లకు షాక్‌..ధాన్యం కొనుగోళ్ళ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు

-

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలని.. ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత పౌరసరఫరాల శాఖదేనని.. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదేనని స్పష్టం చేశారు.

రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలని.. దీని వల్ల రైతుకు ఎంఎస్‌పీ లభిస్తుందని వెల్లడించారు. రావాల్సిన ఎంఎస్‌పీలో ఒక్క రూపాయి కూడా రైతుకు తగ్గకూడదని.. పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారి పక్షాన నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. వారి వైపు నుంచే మనం ఆలోచించాలని.. పంటలకు అందే ధర విషయంలో రైతుల పక్షాన నిలవాలని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news