జూలై 14 నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్..ఇలా హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోండి..

-

తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు అలర్ట్ న్యూస్..ఎంసెట్ హాల్ టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ హాల్ టికెట్లు జులై 11 వ తేదీ వరకు మాత్రమే ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆ తేదీలోగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఎంసెట్ కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

అయితే.. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మాత్రం కల్పించారు అధికారులు..విద్యార్థులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకొవాలి అనుకుంటే మాత్రం జులై 7 వరకూ అవకాశం ఉంది. అయితే లేట్ ఫీ కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.ఇందుకోసం రూ.2700 ఆలస్య రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది..

ఎంసెట్ హల్ టికెట్లను ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

విద్యార్థులు మొదటగా ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ (https://eamcet.tsche.ac.in/) ను ఓపెన్ చేయాలి.

మీకు హోం పేజీలో Download Hall Ticket (E & AM) లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Registration Number, Qualifying Examination Hall Ticket No, Date of Birth వివరాలను నమోదు చేయాలి.

వివరాలను నమోదు చేసిన తర్వాత Get Hallticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

తర్వాత స్క్రీన్ పై మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో జులై 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 14, 15 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ గ్రూప్ ఎగ్జామ్స్, జులై 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ కు సంబంధించిన ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news