పరేడ్ పాలిటిక్స్: బీజేపీని కాంగ్రెస్ దాటుతుందా?

-

ఎప్పుడైతే  బీజేపీ…పరేడ్ గ్రౌండ్ లో భారీ సభ పెట్టి సక్సెస్ అయిందో..అప్పటినుంచి పరేడ్ గ్రౌండ్ చుట్టూ రాజకీయం మొదలైందనే చెప్పొచ్చు. ఏదో సభ సాధారణంగా జరిగిపోతే పరేడ్ గ్రౌండ్ గురించి అంత చర్చ ఉండేది కాదని చెప్పొచ్చు…కానీ అనూహ్యంగా హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడం…అలాగే పరేడ్ గ్రౌండ్ లో లక్షలాది మంది మధ్య మోదీ సభ జరిగింది. ఇక సభకు వచ్చిన జనాలని చూసి మోదీనే ఆశ్చర్యపోయి…సభని విజయవంతంగా నడిపించిన బండి సంజయ్ ని భుజం తట్టి మరీ అభినందించారు. అంటే సభ ఏ స్థాయిలో సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు.

అసలు అంతమంది సభకు వస్తారని ఎవరూ ఊహించి ఉండరు..కానీ ఊహించని విధంగా జనం వచ్చారు. అయితే సభ భారీగా సక్సెస్ అయిందని…ప్రత్యర్ధి పార్టీలు కూడా ఒప్పుకునే పరిస్తితి ఉంది. ఎందుకంటే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో తమకు సభ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అంటే బీజేపీ విజయవంతమైంది…ఇంకా అంతకంటే భారీ స్థాయిలో సభ నిర్వహించాలనేది రేవంత్ ఉద్దేశం.

కాకపోతే సభకు పర్మిషన్ కావాలి కాబట్టి…ముందు పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ సభ పెట్టుకోవాలని, ఆ తర్వాత తమకు సభ నిర్వహించుకునే అవకాశం కల్పించాలని అంటున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ సభతో మోదీ కోటా అయిపోయిందని, ఇక టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకోవాలని, ఆ తర్వాత తాము రాహుల్‌గాంధీతో కాంగ్రెస్‌ సభను నిర్వహిస్తామని, ఎవరి శక్తి ఏమిటో తెలుస్తుందని అంటున్నారు.

అయితే సభని విజయవంతం చేయడం అనేది మాటలు కాదు…బీజేపీ ఎంత కష్టపడితే సభ సక్సెస్ అయిందో చెప్పాల్సిన పని లేదు..పైగా జనం స్వచ్ఛందంగా కూడా వచ్చారు. కాకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సభలు పెడితే…పరేడ్ గ్రౌండ్ లో ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది..మరి టీఆర్ఎస్ సభ పెడుతుందా? కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తుందా? అనేది చూడాలి. అవకాశం వస్తే బీజేపీని మించేలా కాంగ్రెస్ సభ నిర్వహిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news