ఎడిట్ నోట్: జనంతో జగన్…దూరం..దగ్గర!

-

ప్రతిపక్షంలో జనాల మధ్యలో ఉండే నేతలు అధికారంలోకి రాగానే దూరమైపోతారు…ప్రభుత్వాన్ని నడిపించే బిజీ కావొచ్చు..అన్నీ పనులు చూసుకునే దాని బట్టి కావొచ్చు…అధికారంలోకి వస్తే జనాలకు దూరమవుతారు. కానీ అలా దూరమైతే…జనమే తర్వాత ఆ నేతలని ఇంకా దూరం చేసేస్తారు. కాబట్టి ఎప్పుడైనా ప్రజలకు దగ్గరగా ఉంటూ పనులు చేయాలి. అప్పుడే జనం మద్ధతు ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంపై సీఎం జగన్ కు బాగా క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.

ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ జగన్ నిత్యం జనంలోనే ఉన్నారు…దీంతో ఆయనకు ప్రజా మద్ధతు పెరిగింది..అలాగే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో జనాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో 2019లో అధికారం మారిపోయింది. ప్రజా మద్ధతు ఉన్న జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాక…జగన్ జనాలకు దగ్గర ఉండటం కష్టమైపోయింది. ఆయన ప్రభుత్వాన్ని నడిపే పనిలో బిజీగా ఉండటంతో జనాలని కలవడం తగ్గిపోయింది.

ఏదో అప్పుడప్పుడు పథకాల ఓపెనింగ్ కు సభల ద్వారా జనాన్ని చూస్తున్నారు తప్ప..ప్రత్యేకంగా వారిని కలుసుకుని వారి సమస్యలని దగ్గర ఉండి వినడం లేదు. అయితే తమ ఎమ్మెల్యేలని గడప గడపకు పంపించారు. కానీ వారికి ప్రజల నుంచి నిరసనలే ఎదురవుతున్నాయి. అంటే ప్రజల్లో ఉండకపోతే ఇలా నిరసనలే ఎదురవుతాయని చెప్పొచ్చు. ఆ విషయం జగన్ కు సైతం క్లారిటీ వచ్చిందనే చెప్పొచ్చు.

ప్రభుత్వ పనుల్లో ఎంత బిజీగా ఉన్న కొద్ది సమయాన్ని ప్రజలకు కేటాయించాలి. ఆ పని దివంగత వైఎస్సార్ చేశారు…దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు సమయమ కేటాయించి వారి సమస్యలని తెలుసుకుని, వాటిని పరిషర్కించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసేవారు. కానీ జగన్ అలా చేయడం లేదనే చెప్పొచ్చు. కాకపోతే అనేక ఇబ్బందులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎన్ని కష్టాలు ఉన్న ప్రజలకు పథకాలు ఆపడం లేదు. అయితే ఇవన్నీ బాగానే చేస్తున్నారు గాని…నేరుగా ప్రజలని కలవలేకపోతున్నారు. అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలని కలిసి…వారి వారి నియోజకవర్గాల ఉన్న సమస్యలని వినే సమయం కూడా లేకపోతుంది.

దీని వల్ల ప్రజల్లో వ్యతిరేకత…సొంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతుందని వైసీపీ అధిష్టానం అర్ధం చేసుకున్నట్లు ఉంది..అందుకే త్వరలోనే ప్రజా దర్బార్ నిర్వహించడానికి జగన్ సిద్ధమవుతున్నారు. దీని ద్వారా నేరుగా ప్రజలని కలిసి వారి సమస్యలని తెలుసుకుని, వాటిని పరిష్కరించనున్నారు. అలాగే తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సమయం కేటాయించనున్నారు…వారి సమస్యలని తెలుసుకొనున్నారు..అలాగే పార్టీలో ఉండే విభేదాలని తొలగించనున్నారు. ఎమ్మెల్యేలకు ఉండే అసంతృప్తికి చెక్ పెట్టనున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి రూ.2 కోట్లు కేటాయించిన జగన్..ఇంకా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి జనానికి కాస్త దూరమైన జగన్..ఇప్పుడు మళ్ళీ జనాలకు దగ్గర కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news